telugu navyamedia
రాశి ఫలాలు

ఫిబ్రవరి 15, మంగళవారం రాశిఫలాలు

మేషరాశి..

వ్యాపారాల్లో లాభాలు వ‌స్తాయి. తెలియని వ్యక్తులను దూరంగా ఉండ‌డం మంచిది. చేపట్టిన పనిని సకాలంలో పూర్తిచేస్తారు. ఆలోచనలు స్థిరంగా ఉండ‌వు. దైవదర్శనాలు చేస్తాన‌. ఉద్యోగస్తులు విధుల్లో తొందరపాటు మంచిది కాదు. ఆరోగ్యంపై జాగ్ర‌త్త వ‌హించ‌డం మంచిది.

వృషభరాశి..

ఉద్యోగులకు ఉన్నతాధికారులతో సాన్నిహిత్యం పెరుగుతుంది. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. పొరపాటు నిర్ణయాలను సరిదిద్దుకుంటారు. వ్యాపారాలు ఉత్సాహవంతంగా సాగుతాయి. విద్యార్ధులు చదువులో విజయం సాధిస్తారు.

మిథునరాశి..

బంధువులతో విభేదాలు వ‌స్తాయి. సమయానికి అంద‌వ‌ల‌సిన డ‌బ్బు అంద‌దు. ప్రయాణాలు వాయిదా ప‌డ‌తాయి పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. అనవసరమైన పనులకు సమయం వృధా అవుతుంది. వ్యాపారాలు అంత‌గా ముందుకు సాగ‌వు. ఉద్యోగ‌స్తుల‌కు ప‌ని ఒత్తిడి ఎక్కువ‌వుతుంది.

కర్కాటకరాశి..

బంధువులతో స‌ఖ్య‌త ఏర్ప‌డుతుంది. అనుకున్న పనుల్లో విజయం సాధిస్తారు. వ‌స్తు, వాహనయోగం క‌లుగుతుంది. చర్చలు సఫలం అవుతాయి. వ్యాపారాలు అంచనాలు త‌గ్గ ఉంటాయి. విదేశీ ప్రయాణాలు లాభిస్తాయి.ఉద్యోగ‌స్తుల‌కు మంచి స‌మ‌యం ఆస‌న్న‌మ‌వుతుంది. అనారోగ్యం బారిన ప‌డ‌తారు.

సింహరాశి..

విద్యార్థులు విజయం సాధిస్తారు. బంధువులతో అకారణంగా విరోధాలు ఏర్ప‌డ‌తాయి. అనారోగ్యం సూచ‌న క‌నిపిస్తుంది. వ్యాపారస్తులు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగాలలో కీలక మార్పులు ఏర్ప‌డ‌తాయి. ఆఫీసుల్లో ఫెండింగ్ ఉన్న ప‌నులు పూర్తి చేస్తారు.

కన్యరాశి..

కుటుంబ స‌భ్యుల‌తో సఖ్యత ఏర్ప‌డుతుంది. వాహనయోగం క‌లుగుతుంది. భూములు కొనుగోలు చేస్తారు. వ్యాపారాల్లో చిక్కులు వీడతాయి. దైవ‌ద‌ర్శ‌నాలు చేస్తారు. విద్యార్థులు విజయం సాధిస్తారు

తులరాశి..

నిరోద్యోగుల‌కు ఇంటర్వ్యూలు అందుతాయి. బంధు, మిత్రులతో వివాదాలు సర్దుకుంటాయి. వాహనాలు కొంటారు. సేవా కార్య‌క్ర‌మాల్లో పాల్గొంటారు. వ్యాపారంలో లాభదాయకమైన పరిస్థితి ఉంటుంది. ఆర్ధిక ప‌రిస్థితి మెరుగుప‌డుతుంది.

వృశ్చికరాశి..

బంధువులతో తగాదాలు ఏర్ప‌డ‌తాయి. అనారోగ్యం బారిన ప‌డ‌తారు. దైవదర్శనాలు చేస్తారు. వ్యాపారాలు నిరాశాజనకంగా ఉంటాయి. ఉద్యోగస్తుల‌కు పై అధికారులు నుంచి ప్ర‌శంస‌లు అందుకుంటారు. ఆరోగ్యంపై జాగ్ర‌త్త వ‌హించ‌డం మంచిది.

ధనుస్సురాశి..

దూరపు బంధువులతో క‌లుసుకుంటారు. ఇంటాబయటా సమస్యలు త‌లెత్తుతాయి. అనారోగ్యం సూచ‌న‌. అనుకోని ప్రయాణాలు చేస్తారు. వ్యాపారాలు మందగిస్తాయి. వైవాహిక సంబంధాలలో ఇబ్బందులు ఉండవచ్చు. సహోద్యోగులతో విభేదాలు వ‌స్తాయి.

మకరరాశి..

బంధువుల‌తో శుభవార్త‌లు వింటారు. వాహనయోగం క‌లుగుతుంది. కీలక నిర్ణయాలు తీసుకుంటారు. భూలాభాలు. ధనలాభం కలుగుతుంది. వ్యాపారాలలో అనుకూలంగా ఉంటాయి.

కుంభరాశి..

రాజకీయ నాయకులు విజయం సాధిస్తారు. కీలక పనుల్లో విజయం సాధిస్తారు. విద్యావకాశాలు దక్కుతాయి. సంఘంలో గౌరవం ల‌భిస్తుంది. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు ఒత్తిడులు తొలగుతాయి. ఆరోగ్యం కాస్త ఇబ్బందిప‌డుతుంది.

మీనరాశి..

ఉద్యోగంలో ప్రమోషన్ ఏర్ప‌డుతుంది. బాధ్యతలు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి.యువతకు మంచి ఆఫర్లు లభిస్తాయి. ఆలోచనలు నిలకడగా ఉండవు. దూరప్రయాణాలు చేస్తారు. వ్యాపారాలలో కొత్త చిక్కులు ఏర్ప‌డ‌తాయి. ఆలయ దర్శనాలు చేస్తారు.

Related posts