telugu navyamedia
క్రైమ్ వార్తలు ట్రెండింగ్ వార్తలు సామాజిక

ఐదేళ్ళ కూతురితో కలిసి రైలు కిందకు దూకిన వ్యక్తి… చివరకు…!?

Baby

న్యూయార్క్‌లోని ఓ సబ్‌వే స్టేషన్‌లో సోమవారం ఉదయం ఈ దారుణమైన సంఘటన చోటుచేసుకుంది. న్యూయార్క్ సబ్‌వే స్టేషన్‌కు తన ఐదేళ్ళ కూతురితో కలిసి వచ్చిన వ్యక్తి నాలుగో నెం. ప్లాట్‌ఫామ్‌పై నిలబడ్డాడు. సరిగ్గా రైలు వచ్చే సమయానికి కూతురితో కలిసి పట్టాలపై దూకేశాడు. అక్కడ ఉన్న వారంతా ఈ దృశ్యాన్ని చూసి భయభ్రాంతులకు గురయ్యారు. రైలు ప్లాట్‌ఫామ్ మీద ఆగిన వెంటనే కొద్ది మంది రైలు కింద చూడగా.. పాప ప్రాణాలతోనే ఉంది. చిన్న చిన్న గాయాలతో ఉన్న పాపను సురక్షితంగా బయటకు తీసేశారు. పాప తండ్రి మాత్రం రైలు కింద నలిగిపోయి మరణించినట్టు తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. పాపను ఆసుపత్రిలో చేర్చగా.. విషయం తెలుసుకున్న పాప తల్లి వెంటనే ఆసుపత్రికి చేరుకుంది. కాగా, పాప తండ్రి ఆత్మహత్య ఎందుకు చేసుకున్నాడన్నది తెలియాల్సి ఉంది.

Related posts