telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు

ఈ గ్రహాలపై .. పంటలు పండించవచ్చట.. తేల్చేసిన పరిశోధకులు..

farming possible in moon and angarak

భవిష్యత్తులో జాబిల్లి, అంగారకుడిపై మానవులు స్థావరం ఏర్పాటుచేసుకుంటే, వారికి కావాల్సిన ఆహార పదార్థాలను అక్కడే పండించుకోవచ్చు! ఆ రెండింటి మట్టి కొన్ని పంటల సాగుకు అనుకూలంగా ఉందని నెదర్లాండ్స్‌లోని వేజ్‌నింజన్‌ పరిశోధక విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు తాజాగా తేల్చారు.

అచ్చం అంగారకుడు, చంద్రుడి ఉపరితలంపై ఉండే మట్టి తరహా నమూనాల్లో టమాటా, ముల్లంగి, మెంతి, పాలకూర, బఠానీ వంటి పది రకాల పంటలను వారు ప్రయోగాత్మకంగా పండించారు. పాలకూర మినహా అన్ని పంటలు బాగా పెరిగాయని, ఆహారంగా వినియోగించేందుకు వీలుగా వాటి ఉత్పత్తులు ఉన్నాయని తేల్చారు. ఈ పంటలతో లభించే కొన్ని విత్తనాలు తిరిగి సాగుకు ఉపయోగపడేలా కూడా ఉన్నట్లు నిర్ధారించారు.

Related posts