telugu navyamedia
ఆంధ్ర వార్తలు

ప్రారంభ‌మైన‌ అమరావతి నుంచి అరసవిల్లి వ‌ర‌కు రైతుల మహా పాదయాత్ర ..

రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలంటూ రైతుల మహా పాదయాత్ర-2 ప్రారంభమయింది. అమరావతి నుంచి అరవసవిల్లి వరకూ పాదయాత్ర నిర్వహించనున్నారు.

900 కిలోమీటర్లకు పైగా మహా పాదయాత్ర – 2 సాగనుంది. 60 రోజుల పాటు జరిగేలా ప్రణాళికలు రూపొందించారు. గుంటూరు జిల్లాలో 9 రోజుల పాటు పాదయాత్ర జరగనుంది. 12 పార్లమెంట్, 45 అసెంబ్లీ నియోజకవర్గాల మీదుగా యాత్ర సాగనుంది. తెల్లవారు జామున 5 గంటలకు వెంకటపాలెంలోనివెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఉదయం 6గంటల 3 నిమిషాలకు పాదయాత్ర లాంఛనంగా ప్రారంభమైంది.

తొలి రోజు వెంకటపాలెం నుంచి కృష్ణయ్య పాలెం నుంచి పెనుమాక గ్రామం వరకూ ఈ పాదయాత్ర కొనసాగతుంది. పెనుమాక గ్రామంలో మధ్యాహ్నం భోజన విరామసమయంగా నిర్ణయించారు. ఇవాళ రాత్రికి మంగళగిరిలోనే బస చేయనున్నారు.

మొత్తం 12 పార్లమెంటు, 45 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి ఈ పాదయాత్ర కొనసాగనుంది. మధ్యలో పుణ్యక్షేత్రాలను దర్శించుకుంటారు. ద్వారకా తిరుమల, అన్నవరం, సింహాచం పుణ‌్యక్షేత్రాలను రైతులు దర్శించుంటారు. వెంకటపాలెంలో సోమవారం ప్రారంభమయ్యే యాత్ర వెయ్యి కిలోమీటర్లు సాగి, నవంబరు 11న శ్రీకాకుళం జిల్లా అరసవల్లిలో ముగుస్తుంది.

అమరావతి రైతుల మహా పాదయాత్ర తొలి రోజు షెడ్యుల్

*ఉదయం 6.10 నిమిషాలకు వెంకట పాలెం వేంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు.
*ఉదయం 7 గంటలకు ఆల్పాహరం
*9 గంటలకు పాదయాత్ర ప్రారంభం
*వెంకట పాలెం నుండి కృష్ణయ్య పాలెం, అక్కడి నుండి పెనుమాక గ్రామం.
*మధ్యాహ్నం భోజన విరామం.. పెనుమాక రోడ్డులోని తోట
*ఎర్రబాలెం నుండి నవులురు గోలి వారి తోట మీదుగా మంగళగిరి పట్టణంలోకి ప్రవేశం.
*గౌతమ బుద్ధా రోడ్డు లోని రాయల్ కన్వెన్షన్ హల్ లో షెల్టర్

Related posts