telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ

టీఆర్‌ఎస్‌ అధిష్టానాన్ని దోషి అనాలా? క్రిమినల్‌ అనాలా?

vijayashanthi fires data missing issue
వేలమంది రైతులు ఆత్మహత్యలు చేసుకునే వరకు  రైతుబంధు, రైతుబీమా పథకాలను ప్రవేశపెట్టకుండా చోద్యం చూసిన టీఆర్‌ఎస్‌ అధిష్టానాన్ని దోషి అనాలా? క్రిమినల్‌ అనాలా? అని కాంగ్రెస్‌ స్టార్‌ క్యాంపెయినర్‌ విజయశాంతి ప్రశ్నించారు. రైతులకు ఒకేసారి రుణమాఫీ చేయకపోవడం, రైతు బందును కౌల్ రైతులకు వర్తింపజేయకపోవడం రైతుల ఆత్మహత్యలకు కారణమని టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పై ధ్వజమెత్తారు. 
 రైతులను ఆదుకుంటామని చెప్పే సీఎం కేసీఆర్‌ పాలనలో రోజుకు 40 మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నట్లు అధికారుల నివేదికలో స్పష్టమైందని ఆమె అన్నారు. ఇంతకంటే దారుణం ఎక్కడైనా ఉంటుందా? అని  నిలదీశారు. తెలంగాణ కోసం ప్రాణాలు అర్పించిన అమరవీరుల త్యాగాన్ని గుర్తించి రాష్ట్ర విభజనకు అనుకూలంగా కాంగ్రెస్‌ అధిష్టానం నిర్ణయం తీసుకుందని గుర్తు చేశారు. కానీ వేలమంది ప్రాణాలు పోయేవరకు విభజన విషయంలో నిర్ణయాన్ని జాప్యం చేసినట్లుగా చూపిస్తూ కాంగ్రెస్‌ను కేసీఆర్‌ దోషిగా చిత్రీకరించారని ఆరోపించారు.

Related posts