farmers killed by government employees Neglected

ప్రభుత్వ ఉద్యోగుల నిర్లక్యం…65 మంది రైతులు మృతి…

17
ఖమ్మం జిల్లా  రఘనాధ పాలెం లో విషాదం చోటు చేసుకుంది. పొలం దున్నడానికి వెళ్లిన తండ్రి కొడుకులు ఇద్దరు కరెంటు షాక్ కొట్టడంతో అక్కడక్కడికే చనిపోయారు. రైతులకి ఉజిత కరెంటు ఇస్తున్నాము అని తెలంగాణ ప్రభుత్వం చెప్తుంటే, అధికారులు నిర్లక్ష్యం రైతులకి శాపంగా మారుతుంది. కరెంటు తీగలు రైతుల పాలిట మృతువు శాపాలుగా మారుతున్నాయి.  సిబంది తీరుతో విసిగిపోయిన ప్రజలు సొంతంగా సమస్యలు పరిష్కారానికి ప్రయత్నిస్తూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. 
 
పెనుగాలులు, బారి వర్షాలు కురిసినప్పుడు కరెంటు స్తంబాలు వాలిపోయి తీగలు కిందకు వేలాడుతూ ప్రమాదకరంగా మారుతున్నాయి. వాటికీ అధికారులు మరమ్మతులు చేయకపోవడంతో మూగ జీవాలతో పాటు మనుషులు మృత్యువాత పడుతున్నారు. 
 
ఖమ్మం జిల్లా లో గడిచిన 3 ఏళ్లలో 65 మంది వరకు కరెంటు షాక్ తో మృతి చెందారు. జూన్ నెల ప్రారంభమైన కొద్ది రోజులోనే ఖమ్మం జిల్లా లో ముగ్గురు వ్యక్తులు కరెంటు షాక్ తో చనిపోయారు, 10 పశువులు మృత్యువాత పడాయి. విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యం వల్లే అమాయకుల ప్రాణాలు బలవుతున్నాయి అంటున్నారు గ్రామస్థులు. ఇప్పటికైనా విద్యుత్ శాఖ అధికారులు జాగ్రత్తలు తీసుకుంటే రైతులు ప్రాణాలు కాపాడినవారవుతారు, కారీఫ్ సీజన్ మరికొంత మంది రైతులను విద్యుత్ తీగలవల్ల బలి తీసుకోకుండా అధికారులు మేల్కోవాలని ప్రజలు కోరుకుంటున్నారు.