telugu navyamedia
ఆంధ్ర వార్తలు వార్తలు సామాజిక

తీరం దాటిన ఫణి తుపాను..ఒడిశా దిశగా పయనం

fani cyclone effect on badrachalam

పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఫణి తుఫాన్ ఏపీలో తీరం దాటినఫణి ఒడిశాలోకి ప్రవేశించింది.గోపాల్‌పూర్-చాంద్‌బలీ మధ్య ఈ ఉదయం 10:30-11:30 గంటల మధ్య తీరం దాటుతుందని ఆర్టీజీఎస్ అధికారులు తెలిపారు. అయితే, తుపాను ఇంకా తీవ్రంగానే ఉన్నట్టు పేర్కొన్నారు.దీని ప్రభావంతో శ్రీకాకుళంలో భారీ వర్షాలు పడుతున్నాయి.

రాత్రి నుంచి మొదలైన వర్షాలు తెరిపినివ్వడం లేదు. సోంపేటలో గరిష్టంగా పది సెంటీమీటర్ల వాన కురిసింది. ఈదురుగాలులకు శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో భారీ వృక్షాలు నేలకూలాయి. ముందుజాగ్రత్త చర్యగా గురువారమే కరెంటు సరఫరాను నిలిపివేశారు. సహాయ సిబ్బంది, అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ అందరినీ అప్రమత్తం చేస్తున్నారు.

Related posts