telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

కరోనాతో బాలీవుడ్ ప్రముఖ సంగీత దర్శకుడు వాజిద్ ఖాన్ కన్నుమూత

Wajid-Khan

క‌రోనా మహమ్మారికి ప్ర‌ముఖ బాలీవుడ్ సంగీత ద‌ర్శ‌కుడు వాజిద్ ఖాన్ మృతి చెందారు. ఆయన వయసు 42 సంవత్సరాలు. కిడ్నీ స‌మ‌స్య‌తో బాధపడుతున్న ఆయ‌న‌కి కొద్ది రోజుల క్రితం కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో చెంబూరులోని సుర‌న హాస్పిట‌ల్‌లో చేరారు. అయితే ఈ రోజు తెల్ల‌వారుజామున అత‌ని ఆరోగ్యం పూర్తిగా క్షీణించ‌డంతో క‌న్నుమూశారు. స‌లీమ్ మ‌ర్చంట్ అనే మ్యూజిక్ డైరెక్ట‌ర్ ఈ విష‌యాన్ని క‌న్‌ఫాం చేశారు. వాజిద్ మృతి ప‌ట్ల బాలీవుడ్ ప‌రిశ్ర‌మ సంతాపం తెలియ‌జేసింది. ‘‘వాజిద్ ఖాన్ నవ్వును మేమెప్పుడూ మర్చిపోలేం ఎప్పుడూ నవ్వుతూ ఉండే వాజిద్ భాయ్ మృతి పట్ల వారి కుటుంబానికి సంతాపం తెలియజేస్తున్నాం’’ అని ప్రియాంకచోప్రా దంపతులు ట్వీట్ చేశారు. అలానే వాజిద్ ఆకస్మిక మృతి పట్ల ప్రముఖ నేపథ్య గాయకుడు సోనునిగం సంతాపం తెలిపారు. వాజిద్ మృతి పట్ల నేను షాక్ కు గురయ్యాను అంటూ ప్రముఖ నటుడు వరుణ్ ధావన్ ట్వీట్ చేశారు. స‌ల్మాన్ ఖాన్ హీరోగా 1998లో వ‌చ్చిన ప్యార్ కియా తో డ‌ర్‌నా క్యా అనే సినిమాతో సాజిద్ వాజిద్ ద్వ‌యం బాలీవుడ్ ఆరంగేట్రం చేశారు. గ‌ర్వ్‌, తేరేనామ్, తుమ్‌కో నా బూల్ పాయేంగే, పార్ట్న‌ర్‌, ద‌బాంగ్ ఫ్రాంచైజీలో వచ్చిన చిత్రాల‌న్నింటికీ ఈ ద్వ‌యం సంగీతం అందించారు. ఇటీవల లాక్ డౌన్ లో ఈద్ సందర్భంగా సల్మాన్ ఖాన్ పై ‘‘భాయ్ భాయ్’’అంటూ ఓ పాటను విడుదల చేశారు సాజిద్- వాజిద్ ఖాన్ ద్వయం. ఐపీఎల్ 4కి థీమ్ సాంగ్‌తో పాటు దూమ్ ధూమ్ ధూమ్ ద‌డ‌క‌కి కూడా మ్యూజిక్ అందించారు.

Related posts