విజయవాడలో బాలాజీ లాడ్జీలో ఓ కుటుంబం పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసింది.
వివర్లాలోకి వెళితే..
మచిలీపట్నంకు చెందిన జూపూడి వెంకటేశ్వరరావు కుటుంబం ఆర్ధిక ఇబ్బందుల్లో చిక్కుకుంది. అప్పుల వాళ్లు బాకీలు ఇవ్వాలని పోరు పెడుతుండటంతో ఏం చేయాలో తెలియక వెంకటేశ్వరరావు కుటుంబం విజయవాడఆర్టీసీ బస్టాండు అవుట్‌గేట్ సమీపంలోని బాలాజీ లాడ్జీలో ఉంటున్నారు. ఈ క్రమంలో సోమవారం ఉదయం పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు.
విషయం తెలిసిన వెంటనే కృష్ణలంక పోలీసులు వారితో ఉప్పునీరు తాగించి ప్రాణాంతక విషాన్ని బయటకు కక్కించారు. వీరిని వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. నలుగురు ప్రస్తుతానికి ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు.
కాగా ఈ ఘటనపై కృష్ణలంక పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు.
.