facebook working on your time on facebook

ఇకపై సమయం కూడా లెక్కించనుంది…కొత్త ఫీచర్..

93

అంతర్జాల దిగ్గజం ఫెస్ బుక్ సరికొత్త టెక్నాలజీతో ముందుకు రానుంది. ఫెస్ బుక్ లో మనం ఎంతసేపు గడుపుతున్నామో తెలుసుకునేందుకు సరికొత్త టూల్ ను ప్రవేశపెట్టనుంది. దీనితో గంటలకొద్దీ చాటింగులు, పోస్టింగుల ద్వారా సమయాన్ని వృధా చేస్తున్న వారిలో ఎవరు ఎంత సమయం గడుపుతున్నారన్న విషయం ‘టైమ్ వెల్ స్పెంట్’ అనే టూల్ ప్రతి సెకనును లెక్కేసి చూపించనుంది.

facebook-working-on-your-time-on-facebook

ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్న యువర్ ‘టైం ఆన్ ఫెస్ బుక్’ ఫీచర్ ఆధారంగా వారం రోజుల క్రితం మనం ఫెస్ బుక్ లో ఎంతసమయం కేటాయించామో తెలిపేది, దాన్ని అభివృద్ధి చేస్తూ సగటున ఎంతసేపు లాగిన్ అయి ఉన్నారో లెక్కలు తీయడమే కాకుండా అదనంగా ఇంకొక ఫీచర్ ను కూడా రూపొందించింది. తద్వారా మనం ఎంతసేపు ఫెస్ బుక్ చూడాలనుకుంటామో ఒక నిర్ణిత సమయాన్ని నోటిఫికేషన్ లో సెట్ చేసుకుంటే ఆ సమయం పూర్తవగానే ఫేస్ బుక్ ద్వారా మనకొక రిమైండర్ కూడా వస్తుందట.

ఒక్క ఫెస్ బుక్ ఏ కాదు అంతర్జాలంలో ఉన్న మరో సాంఘిక మాధ్యమం ఇన్స్టాగ్రామ్ కూడా ఇలాంటి ఫీచర్ ను తయారీ చేయడంలో మునిగింది. మొత్తానికి ఈ కంపెనీలు ఆలోచించిన తీరు మానవ సమాజంలో సమయం వృధా అవకుండా చేయడం శుభ పరిణామం అని చెప్పుకోవచ్చు. కేవలం లాభాల కోసమే కాకుండా సమాజం మీద కూడా దృష్టి పెట్టడంతో మరింత ఆదరణ పొందుతున్నాయి.