facebook in another issue

ఫేస్ బుక్ లో వ్యక్తిగతం..బహిర్గతం…

41

ప్రముఖ సామజిక మాధ్యమంగా ఫేస్ బుక్ ఉన్నత స్థాయికి చేరుకుంది. కానీ అప్పటినుండి ఎన్నో ఆరోపణలను ఎదుర్కొంటూనే ఉంది. ఇటీవల వినియోగదారుల సమాచారం వేరే వారికి అమ్ముకున్నట్టు వచ్చిన వార్తలతో అనేక దుమారాన్ని రేపాయి. సంస్థ యజమాని కూడా ఇప్పటికే అనేక సార్లు వినియోగదార్లకు క్షమాపణలు తెలిపిన విషయం తెలిసిందే.

అప్పటి సమాచార దొంగిలింపు వార్తను మరుగున పడేద్దామని సంస్థ అనేక కొత్త ఫీచర్స్ ను కూడా అందుబాటులోకి తెచ్చింది. కానీ వాటి ప్రాచుర్యం కంటే విమర్శలే ప్రముఖంగా వినపడుతున్నాయి. ప్రస్తుతం 14 మిలియన్ల వినియోగదారుల వ్యక్తిగతంగా ఉంచిన సమాచారం బహిర్గతం అయింది. దీనితో ఫేస్ బుక్ పై మళ్ళీ విమర్శలు వచ్చాయి.

అయితే ఇది సంస్థ పై జరిగిన సైబర్ దాడా లేక మరేమైనా అనేది తెలియాల్సి ఉంది. ఏది ఏమైనా సంస్థ యజమాని ఫేస్ బుక్ పెట్టుబడులను ఉపసంహరించుకుంటున్నాడు కదా అని దీనిపై శ్రద్ద తగ్గిందా అనే విమర్శలు లేకపోలేదు. ఎన్ని సార్లు విమర్శలు వచ్చినా జుకెన్ బర్గ్ వినియోగదారులకు మరోసారి క్షమాపణ తెలిపారు. ఇన్ని వదంతులు వస్తున్నా ఫేస్ బుక్ ను మాత్రం వాడుతూనే ఉండటం గమనార్హం.