ప్రధాని మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ సర్కారు కేంద్రంలో అధికారంలోకి రాబోతోందని ఎగ్జిట్ పోల్స్ స్పష్టం చేయడంతో విపక్షాలు డీలాపడ్డట్టు స్పష్టమవుతోంది. ఎగ్జిట్ పోల్స్ ఫలితాల వెల్లడితో డిల్లీలో రాజకీయ సమీకరణాలు ఒక్కసారిగా మారిపోయాయి. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీలతో నేడు ఢిల్లీలో జరగాల్సిన భేటిని బహుజన సమాజ్‌వాదీ పార్టీ అధినేత్రి మాయావతి రద్దు చేసుకున్నారు.
మాయావతి ఈరోజు ఢిల్లీకి రావడం లేదని, లక్నోలోనే ఉంటారని బీఎస్పీ నేత ఎస్సీ మిశ్రా తెలిపారు. మరోవైపు శనివారం లక్నోలో మాయావతితో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు చర్చలు జరిపారు. ఈరోజు కూడా ఢిల్లీలో మాయావతిని ఆయన కలవనున్నారని టీడీపీ వర్గాలు తెలిపాయి. అయితే మాయావతి ఢిల్లీ పర్యటన రద్దు చేసుకోవడం విపక్షాల్లో చర్చనీయాంశంగా మారింది.
ఎగ్జిట్ పోల్స్ ఫలితాల ప్రకారం ఉత్తరప్రదేశ్‌లోని మొత్తం 80 సీట్లలో బీజేపీకి గరిష్టంగా 57 స్థానాల వరకు రావొచ్చని ఎగ్జిట్ పోల్స్ వెల్లడించాయి. మహాకూటమికి 40 సీట్లు దాకా వచ్చే అవకాశముందని తెలిపాయి. కాంగ్రెస్‌కు రెండు సీట్లు వస్తాయని అంచనా వేశాయి. ఎగ్జిట్ పోల్స్‌ప్రకటించిన ఫైలితాల పై దేశవ్యాప్తంగా ఆయా రాజకీయ పార్టీలు తమ భవిష్యత్తు ప్రణాళికను సిద్దం చేసుకుంటునట్టు తెలుస్తోంది.
ఓటుకు నోటు కేసులో ఇరుక్కొని చంద్రబాబు పారిపోయారు: మోత్కుపల్లి