BREAKING NEWS:

మాజీ రిజిస్టార్..భార్యతో కలసి ఆందోళన-పింఛన్ ఇవ్వకుండా వేధిస్తున్న అధికారులు

70

పదవీ విరమణ చేసి మూడేళ్లు గడుస్తున్నా పింఛన్ ఇవ్వకుండా వేధిస్తున్నారని మానసిక ఆందోళనకు గురిచేస్తున్నారని తెలంగాణ యూనివర్సిటీ రిటైర్డ్ మాజీ రిజిస్టార్, ప్రొఫెసర్ ఎం.ధర్మరాజు కన్నీటి పర్యంతం అయ్యారు. గురువారం మధ్యాహ్నం తన భార్యతో కలసి పరిపాలన భవనానికి వచ్చిన ధర్మరాజు.. రిజిస్టార్ శివశంకర్ ఛాంబర్లో నేలపై బైఠాయించి నిరసనకు దిగారు.

ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ మూడేళ్ళుగా క్యాంపస్ అధికారుల చుట్టూ తిరుగుతున్న పింఛన్ మంజూరు చేయకుండా వేధిస్తున్నారని, 2008 లో తెలంగాణ యూనివర్సిటీలో విధుల్లో చేరిన తాను ఇంగ్లీష్ విభాగం డీన్ గా, ఆర్ట్స్ కాలేజీ ప్రిన్సిపాల్ గా, అడిట్ సెల్ డైరెక్టర్ గా, రిజిస్టార్ గా పని చేశారన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో జాక్ ఛైర్మెన్ గా సేవలందించానన్నారు. 2015 ఏప్రిల్ లో పదవి విరమణ చేసిన తనకు న్యాయంగా రావలసిన పింఛన్ ఇవ్వడంలేదని ఆరోపించారు, పింఛన్ ఇవ్వకపోతే జీవనం ఎలా సాగించాలని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఆందోళనలవల్ల గుండెపోటు వస్తే స్టెంట్ వేయించుకున్నానని అన్నారు.

ex-registrar protest for providentfund

ఈ విషయమై ఉన్నత విద్యా మండలి అధికారులకు విన్నపించగా పింఛన్ మంజూరు చేయాలనీ తెలంగాణ యూనివర్సిటీ వీసీ రిజిస్టార్ లకు ఆదేశాలు జారీచేశారని కానీ ప్రస్తుత రిజిస్టార్ శివశంకర్ తనకు పింఛన్ మంజూరు చేయకుండా వేధిస్తున్నారని ఆరోపించారు. ఇప్పటికైనా సీఎం, ఉన్నత అధికారులు స్పందించి వెంటనే పింఛను మంజూరు చేసి ఆదుకోవాలని ధర్మరాజు విన్నపించారు.