telugu navyamedia
ఆరోగ్యం

రోజుకోక బోయిల్డ్ ఎగ్ తింటే..బూస్ట్ ఇమ్యూనిటీ

అధిక‌ పోషకాలు కలిగిన ఆహారం ఏదైనా ఉందంటే.. అది ఒక్క గుడ్డు. ఆరోగ్యం కోసం రోజుకొక గుడ్డును తీసుకోవాలని వైద్యులు కూడా సూచిస్తుంటారు. గుడ్డులో ఉండే పౌష్టకాల విషయానికొస్తే.. మానవ శరీరానికి 13 రకాల విటమిన్స్, మినరల్స్‌, శరీరానికి శక్తినిచ్చే ప్రోటీన్స్, ఆరోగ్యాన్ని కాపాడే కీలకమైన యాంటి ఆక్సిడెంట్స్ శరీరానికి గుడ్డు ద్వారా సమకూరుతాయి.

Eggs in Diarrhea: Should we avoid eating eggs during diarrhea?

రోజూ ఒక ఉడుకబెట్టిన గుడ్డు తింటే 77 కేలరీలు, 6 గ్రాముల ప్రోటీన్స్, 5 గ్రాముల హెల్తీ ఫ్యాట్స్ శరీరానికి అందుతాయి. ఇవే కాకుండా కోడిగుడ్డులో విటమిన్ డి, విటమిన్ ఈ, విటమిన్ కె, విటమిన్ బి6, క్యాల్షియం, జింక్ ఒక భాగంగా ఉంటాయి. అందుకే రోజూ రెండు కోడి గుడ్లు రోగ నిరోధక శక్తిని పెంచడానికి ఎంతో దోహదపడుతుంది.

Egg yolk: Nutrition and benefits

కోడి గుడ్డుని పచ్చిగా పగల కొట్టుకుని తాగవచ్చు. అయితే అలా చేసే వాళ్లు ఒక విషయం మాత్రం గుర్తు పెట్టుకోవాలి. కోడిగుడ్లలో సాల్మొనెల్లా అనే బ్యాక్టీరియా ఉంటుంది. మామాలుగా అయితే కోడిగుడ్డుని ఉడికిస్తే ఆ బ్యాక్టీరియా నశిస్తుంది. కానీ, చాలా మంది మాత్రం పచ్చిగానే పగలకొట్టి తాగుతున్నారు. పచ్చిగా తాగితే ఆ బ్యాక్టీరియా శరీరంలోకి చేరుతుంది. రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం అందించే గుడ్డుతో శరీరానికి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి.

గుడ్లు తినడం వల్ల కలిగే ప్రయోజనాలు:-

* గుడ్డును తీసుకోవడం వల్ల ఎన్నో ప్రయోజనాలున్నాయి. గుడ్డులోని ఐరన్‌ని శరీరం వేగంగా గ్రహిస్తుంది. ఐరన్‌ గర్భిణులు, బాలింతలకు ఉపయోగపడుతుంది. మహిళల్లో రొమ్ము కాన్సర్ రాకుండా కాపాడుతుంది.

Is It Safe To Have Half Boiled Or Raw Eggs During Pregnancy - lifealth

* గుడ్డులో అల్బుమిన్ ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. శరీరంలో ప్రోటీన్ లోపాన్ని పోవ‌డానికి అవసరమైన పోషణను అందించడంలో ఇది చాలా ఉపయోగపడుతుంది.
* రోజు గుడ్డు తింటే జట్టు ఆరోగ్యంగా ఉండటమే కాకుండా, గోళ్లు ఆరోగ్యంగా ఉంటాయి. ఎందుకంటే వాటిలో సల్ఫర్తో సహా ఇతర ఖనిజ విటమిన్లు ఉంటాయి.

6 Beauty Benefits Of Eggs For Hair Care | Femina.in
* గుడ్డులో విటమిన్ ఎ, డి అధికంగా ఉంటుంది. ఇది కళ్ళు ఆరోగ్యంగా ఉండటానికి సాయపడతుంది. గుడ్డులో పొటాషియం, కాల్షియం పుష్కలంగా ఉంటాయి. ఇవి ఎముకలు గట్టిపడటానికి ఉపయోగపడతాయి. .ఇది సూర్యకిరణాలను శరీరంలోకి పీల్చుకోవడానికి సహాయపడుతుంది.

5 Ways to Strengthen Your Bones - Orthopaedic Specialty Group
* గుడ్లలో లభించే చాలా విటమిన్లు మరియు ప్రోటీన్లు మెదడును పదును పెట్టడంలో చాలా ప్రయోజనకరంగా ఉంటాయని సర్వే లో తేలింది. రోజుకు 2 ఉడికించిన(boiled egg) గుడ్లు తినడం వలన మీ మనస్సును ఎల్లప్పుడూ సజీవంగా మరియు చురుకుగా ఉంచుతుంది.

Cholestrol & Eggs: Are Eggs Bad for Cholesterol?
* ఇది నరాల బలహీనత తగ్గేలా చేయ‌డంతో పాటు.. గుండె జబ్బుల నివారణకు తోడ్పడుతుంది.

How to make the perfect hard boiled eggs

Related posts