telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ఆ హీరో గర్ల్ ఫ్రెండ్ కోసం సినిమాలోంచి తీసేశారు… నెపోటిజంపై ఎవ్లీన్ శర్మ కామెంట్స్

Evelyn-Sharma

బాలీవుడ్ యువ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య తర్వాత ఇండీస్ట్రీలో నెపోటిజంపై వార్ నడుస్తోంది. పలువురు నటీనటులు ఇండస్ట్రీలో ఉన్న బంధు ప్రీతి కారణంగా తాము ఎన్నో అవకాశాలు కోల్పోయామంటూ నోరు విప్పుతున్నారు. ఈ నేపథ్యంలోనే బాలీవుడ్ నటి ఎవ్లీన్‌ శర్మ నెపోటిజంపై సంచలన వ్యాఖ్యలు చేసింది. తనకు వచ్చిన ఎన్నో సినిమా అవకాశాలు బంధు ప్రీతి కారణంగా మిస్సయ్యాయని చెప్పింది ఎవ్లీన్‌ శర్మ. కొన్ని సినిమాలకు ఎంచుకొని, అగ్రిమెంట్ కూడా అయ్యాక రాత్రికి రాత్రే తొలగించారని చెప్పింది. వచ్చిన అవకాశం చివరి నిమిషంలో అలా చేజారిన సందర్భాల్లో ఎంతో బాధేసేదని ఆమె చెప్పుకొచ్చింది. ఒక సినిమాలో అయితే హీరో గర్ల్ ఫ్రెండ్ కోసం తనను తీసేయడం జరిగిందని, ఇండస్ట్రీలో ఇలాంటి దారుణాలు ఎన్నో జరుగుతున్నాయని ఎవ్లీన్‌ ఆవేదన వ్యక్తం చేసింది. ఆ ఘటనలే తనలో మరింత ధైర్యాన్ని పెంపొందించాయని తెలిపింది. బాలీవుడ్‌లో అధికారం, డబ్బు ఉన్న వాళ్లదే రాజ్యమని, ఇక్కడ ఉన్నవాడిదే ఆధిపత్యమని ఈ బాలీవుడ్ బ్యూటీ క్లారిటీగా చెప్పుకొచ్చింది. ఈ బ్యూటీ “సాహో” సినిమాలో కూడా మెరిసింది.

Related posts