telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

పాక్ ను .. సూటిగా ప్రశించిన ఐరోపా సమాఖ్య..

European Union also supports India on J & K issue

పాక్ కు మరోసారి అంతర్జాతీయంగా ఎదురుదెబ్బతగిలింది. ఇప్పటికే ఐక్యరాజ్యసమితి భద్రత మండలిలో మెజారిటీ దేశాలు భారత్ చర్యలను సమర్ధించారు. తాజాగా ఐరోపా సమాఖ్య కూడ భారత్‌కు మద్దతు పలికింది. చాల సంవత్సరాల సమావేశమైన ఐరోపా దేశాల సమఖ్య కశ్మీర్‌ అంశంపై చర్చ చేపట్టింది. కశ్మీర్ అంశంలో భారత్‌ను అంతర్జాతీయ సమాజంలో నిలబెట్టాలని పాక్ ప్రయత్నాలు చేస్తున్న నేపథ్యంలోనే ఆ దేశానికి మరోసారి షాక్ తప్పలేదు. కశ్మీర్ లో మానక హక్కులు హరించుకుపోతున్నాయని ఆరోపణలు చేస్తూ ఐరాసకు పాక్ ఫిర్యాదు చేసిన నేపథ్యంలోనే ఐరాస భద్రతా మండలి సమావేశం అత్యవసర సమావేశం నిర్వహించిన విషయం తెలిసిందే. పాక్ ఆశించినట్టుగా ఐరాస దేశాల నుండి మద్దతు లభించ లేదు.

తాజాగా 12 సంవత్సరాల తర్వాత సమావేశమైన బ్రస్సెల్స్‌లో సమావేశమైన ఐరోపా సమాఖ్య దేశాల సమాశం కొనసాగింది. దీంతో కశ్మీర్ అంశాన్ని చర్చించారు. ఈ నేపథ్యలంలోనే భారత్‌కు మద్దతుగా పలుదేశాలు నిలిచాయి. చర్చలో భాగంగా యూరోపియన్ పార్లెమెంటేరియన్ అయిన రియాజ్ మాట్లాడారు. ప్రపంచంలోనే భారత్ గోప్ప ప్రజాస్వామ్య దేశమని ,భారత్, జమ్ముకశ్మీర్‌లో జరుగుతున్న ఉగ్రదాడులకు పరిగణలోకి తీసుకొని మద్దతుగా నిలవాల్సిన అవసరముందని అన్నారు.ముఖ్యంగా ఉగ్రవాదులు పాక్ నుండి వస్తున్నారు తప్ప ఆకాశం నుండి ఊడిపడడం లేదని పాక్ కు గట్టి హెచ్చరిక చేశారు. దీంతోపాటు కశ్మీర్ అంశం ఇరుదేశాలకు సంబంధించిన అంశమని శాంతీయుత చర్చల ద్వార పరిష్కరించుకోవాలని ఐరోపా సమాఖ్య నిర్ణయించింది.

Related posts