telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు

ఆ ఊరిలో ఒకరిని మినహాయించి అందరికి కరోనా.. ఎలా..?

కరోనా విజృంభణ భారత్ లో ఏ మాత్రం తగ్గడం లేదు. అయితే హిమాచల్ ప్రదేశ్ లోని లాహాల్ లోయలోని తోరాంగ్ గ్రామంలోని నివాసితులందరూ కరోనా బారిన పడ్డారు. అయితే ఆ ఊరి నివాసి అయిన 52 ఏళ్ల భూషణ్ ఠాకూర్ ను మినహాయించి మిగతా అందరూ కోవిడ్ -19 పాజిటివ్ గా నిర్దారించబడ్డారు. లాహాల్ లోయలో కేసుల పెరుగుదల కారణంగా రోహ్తాంగ్ సొరంగం యొక్క ఉత్తర పోర్టల్ సమీపంలో ఉన్న టెల్లింగ్ ఉల్లాకు పర్యాటక కదలికలను పరిమితం చేయాలని భావిస్తోంది. దీంతో ఇక పర్యాటకులను లాహాల్ గ్రామాల్లోకి గురువారం అనుమతించలేదు. సొరంగం దాటి ఉన్న గ్రామాలను కంటైన్మెంట్ జోన్లుగా మార్చారు. అధికారుల వివరాల ప్రకారం, మనాలి-లే హైవే వెంట ఉన్న తోరాంగ్ గ్రామంలో కేవలం 42 మంది నివాసితులు ఉన్నారు. ఎందుకంటే చాలా మంది ప్రజలు శీతాకాలం కోసం కులుకు వలస వెళ్లారు. కొన్ని రోజుల క్రితం గ్రామస్తులు స్వచ్ఛందంగా పరీక్షలు చేయించుకోవాలని నిర్ణయించుకున్నారు. అలా మొత్తం 42 నమూనాలలో 41 పాజిటివ్ పరీక్షించబడ్డాయి. ఇక తాను ఒక ప్రత్యేక గదిలో ఉంటున్నానని గత నాలుగు రోజులుగా నా స్వంత భోజనం నేనే వండుకుంటున్నానని ఆయన అన్నారు. ఫలితాల గురించి తెలుసుకునే వరకు నేను నా కుటుంబ సభ్యులతో ఉన్నానని, అయినప్పటికీ, చేతులు శుభ్ర పరచడం, మాస్క్ ధరించడం వంటి అన్ని ప్రోటోకాల్స్ పాతిన్చనని అన్నారు. కొన్ని రోజుల క్రితం మతపరమైన కార్యక్రమంలో గ్రామస్తులు అంతా ఒకే చోట కలిశారు అని అధికార వర్గాలు అంటున్నాయి. 

Related posts