emergency situation withdrawal in kerala

కేరళలో అత్యవసర పరిస్థితి ఉపసంహరణ…

84
నిఫా వైరస్ సమస్యతో అత్యంత అప్రమత్తత హెచ్చరికను కేరళ ప్రభుత్వం ఉపసంహరించుకుంది. నిఫా వైరస్ అదుపులోకి వచ్చినందు వలన జూన్ 12 నుండి పాఠశాలలు తెరవబోతున్నట్లు కేరళ ప్రభుత్వం ప్రకటించింది. గత నేలలో ఈ నిఫా వైరస్ బారిన పడి 17 మంది చనిపోయారు. కేరళ ప్రభుత్వం కోజికోడ్, మలపురం జిల్లాలకు రాకపోకలు నిలిపివేసి నిఫా వైరస్ నివారణ చేపట్టింది.
నిఫా వైరస్ ప్రభావిత ప్రాంతంలో పరిస్థితులు సాధారణ స్థితికి వచ్చినట్లు కేరళ ప్రభుత్వం ప్రకటించింది. ఈ నెలాఖరి వరకు పరిస్థితిని జాగ్రత్తగా గమనిస్తాం అని కేరళ ఆరోగ్య మంత్రి తెలిపారు.  నిఫా వైరస్ అరికట్టేందుకు అన్ని చర్యలు తీసుకున్నట్టు ఆయన తెలిపారు. నిఫా వైరస్ ను అరికట్టేందుకు కృషిచేసిన వైదులందరికీ అభినందించారు.