telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సామాజిక

సైబోర్గ్‌ల్లా మనుషులు… ఎలాన్ మస్క్ సంచలనం

Elon Musk

సూపర్‌మ్యాన్‌ లో హీరో పాత్రధారులకు సూపర్‌పవర్‌లు ఉంటాయి. ఇకపై సినిమాల్లో చూపించినంతగా కాకపోయినా.. ఇప్పుడున్న మనిషిని మరింత శక్తిమంతంగా తయారు చేసే టెక్నాలజీ అందుబాటులోకి రానుంది. ఈ విషయాన్ని స్పేస్‌ ఎక్స్‌ వ్యవస్థాపకుడు ఎలాన్‌ మస్క్‌ వెల్లడించారు. ఇందుకోసం న్యూరాలింక్‌ పరికరాన్ని మరికొన్ని నెలల్లో అందుబాటులోకి తీసుకొస్తానని చెప్పారు. దీనితో ఎవరైనా సూపర్‌మ్యాన్‌గా మారిపోవచ్చంటున్నారు. అదెలా అంటే.. మనిషి మెదడును కంప్యూటర్‌కు అనుసంధానం చేసి తద్వారా శక్తిమంతంగా మారుస్తానంటున్నారు. ఇంకా అర్థమయ్యేలా చెప్పాలంటే మనిషి మెదడులో అమర్చగలిగే ఇంప్లాంట్లను తయారు చేసి వాటిలో సాఫ్ట్‌వేర్‌ నిక్షిప్తం చేస్తారు. ఆ ఇంప్లాంట్లను కంప్యూటర్లకు అనుసంధానిస్తారు. వాటి సాయంతో కంప్యూటర్లు, స్మార్ట్‌ పరికరాలతో మనిషి నేరుగా సమాచార మార్పిడి చేసుకోగలుగుతారన్నమాట.

శరీరంలో కంప్యూటర్‌ చిప్‌లు పెట్టుకుని హాలీవుడ్‌ సినిమాల్లో సైబోర్గ్‌లు (సగం మనిషి, సగం మరమనిషి) తిరుగుతుంటారు. ఈ టెక్నాలజీ అందుబాటులోకి వస్తే మనిషి కూడా వాటిలా తయారవుతాడని ఎలాన్‌ చెప్పారు. అదెలా సాధ్యమంటే.. ఇప్పటికే స్మార్ట్‌ఫోన్లతో మనిషి సైబోర్గ్‌ల్లా మారిపోయాడని ఆయన వాదిస్తారు. ప్రస్తుతం స్మార్ట్‌ఫోన్ల నుంచి సమాచారాన్ని మెదడు సేకరిస్తుందని, న్యూరాలింక్‌ ద్వారా ఇది మరింత స్మార్ట్‌గా తయారవుతుందని చెప్పారు. దీంతో ఎలాంటి ప్రశ్నలకైనా ఇట్టే సమాధానం చెప్పొచ్చని అన్నారు. ఉదాహరణకు డిజిటల్‌ నుంచి శరీరానికి ఒక ‘స్ట్రా’లా ఇప్పుడు సమాచారం చేరుతుందని, న్యూరాలింక్‌ ద్వారా.. ఒక నదీ ప్రవాహంలా సమాచారం అందుతుందని పేర్కొన్నారు.

Related posts