elizabeth-birthday-celebrations-special-charanpreet

ఎలిజబెత్ జన్మదిన వేడుకలో…ప్రత్యేక ఆకర్షణ

118

బ్రిటన్ మహారాణి ఎలిజబెత్ అధికారిక జన్మదిన వేడుకలోను దాదాపు వేయిమంది బ్రిటీష్ సైనికులు కవాతు చేయగా అందులో చరణ్ ప్రీత్ సింగ్ లాల్ అనే సైనికుడు బెటాలియన్ కోల్డ్ స్ట్రీం గార్డ్స్ నుంచి మొట్టమొదటిగా, ‘ట్రూపింగ్ ది కలర్’లో సాంప్రదాయ పొడవైన బేర్స్కిన్ టోపీకి బదులుగా తలపాగాను ధరించి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. ప్రతి ఏటా ఎలిజబెత్ మహారాణి వేడుకలను పురస్కరించుకొని కామన్వెల్త్ సైనిక దళాలు ఒక ఉత్సవంలా నిర్వహించే ఈ విన్యాసాన్ని ‘ట్రూపింగ్ ది కలర్’ గా పేర్కొంటారు.

elizabeth-birthday-celebrations-special-charanpreet

దాదాపు 270 సంవత్సరాల కలం నుంచి నివహిస్తున్న ఈ ‘ట్రూపింగ్ ది కలర్’లో పాల్గొనే ప్రతి సైనికుడు ఎలుగుబంటి చర్మంతో తయారు చేసిన టోపీలను ధరించడం ఆనవాయితీ. అయితే, ఈ సంవత్సరం భారత సంతతికి చెందిన చరణ్ ప్రీత్ సింగ్ లాల్ నల్లని తలపాగాతో కవాతులో పాల్గొని ప్రత్యేక ఆదర్శనగా నిలవడంతో ప్రభుత్వం చేత ప్రశంసలు అందుకున్నాడు.

22 సంవత్సరాల వయసున్న లాల్, 2016లో బ్రిటిష్ సైన్యంలో చేరాడు. వాస్తవానికి అతను భారత సంతతికి చెందిన అయన ఇంగ్లాండ్ లో ఒక కుటుంబానికి దత్తతగా వెళ్లాడు. కవాతులో ప్రత్యేక ఆదర్శన నిలిచి ట్విట్టర్ లో కూడా అభిమానులను దక్కించుకున్నాడు.