telugu navyamedia
తెలుగు కవిత్వం

* ఎలక్షన్ల చిత్రాలు -ఎన్నెన్నో విచిత్రాలు *

2019 with elections is major agenda
ప్రజాసేవ చేయాలనీ
పంచాయతీ ఎలక్షన్లో 
మనోడు పోటీబడే…
నగానట్రా కుదువబెట్టి 
అప్పుసప్పు కూడబెట్టి…
భూమిజాగలమ్ముకొని 
లక్షల్లో డబ్బుపోసి 
ఎలక్షన్లో గెలిచినా…
మనోడు గెలిచెననీ 
ఊరువాడా నాయకులు.. 
దోస్తు బంధు బలగాలు… 
మందు, విందు, చిందులు… 
బహు పసందైన దావతులతో 
ఉషారెంతోజేసినా….
ఎలక్షన్లో గెలుపుకై  
ఖర్చుబెట్టిన సొమ్ము…
కూడబెట్టేదెలా…!? అని 
మెదడు తొలచి, లెక్కలేసి…
రాత్రిపగలు శోచాయిస్తూ…
రందెంతో ఉన్నాగానీ 
రాజులానే నవ్వబట్టే…. 
ప్రభుత్వ పథకాలు 
నాయకులిచ్చే కాంట్రాక్టులు.. 
ఖర్చునుండి గట్టెంక్కించే 
రాబడి ఆదాయమనీ… 
మనోడు భరోసాతో… 
మనసు నిమ్మలంజేసుకొని 
మస్తు  ఖుషీ గాబట్టే…
     *రచన*
   
     …రాశ్రీ 
    రాచర్ల శ్రీనివాస్ 

Related posts