telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

జూన్ 6న ఈటల ఢిల్లీ పయనం !బీజేపీలో చేరిక !!

TRS ‘తిరుగుబాటు’ నాయకుడు ఈటల రాజేందర్ BJP లో చేరడానికే మొగ్గు చూపుతున్నారు. ఇందుకుగాను జూన్ 6 వ తేదీ ముహూర్తం ఖరారైంది.ప్రధాని మోడీ,అమిత్ షా,నడ్డాల అపాయింట్ మెంట్ తేదీ కోసం ఈటల ఎదురు చూస్తున్నట్టు తెలిసింది.ఈటెలతో పాటు మాజీ జడ్పీ చైర్ పర్సన్ తుల ఉమ, మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి, మాజీ ఎంపీ రమేష్ రాథోడ్ BJP లో చేరే అవకాశం ఉన్నది. బుధవారం ఉదయం నుంచి ఈటల తన నివాసంలో సన్నిహితులతో విస్తృత చర్చలు జరుపుతున్నారు.బీజేపీలో చేరిక పై అందరి అభిప్రాయాలను ఈటెల తీసుకున్నారు.బీజేపీ చేరిక పై ఈటెల శిబిరంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నట్లు ప్రచారం సాగుతోంది.అందరి సూచనలు ఈటెల తీసుకున్నారు.తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం జూన్ 2 న ఎమ్మెల్యే పదవికి,టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయాలని ఈటల సూత్రప్రాయంగా నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది.వారం రోజులుగా బీజేపీ నేతలతో జరుగుతున్న ఈటెల చర్చలు బుధవారం ఒక కొలిక్కి వచ్చినట్టు ఈటల శిబిరం నుంచి సమాచారం అందుతున్నది. తెలంగాణ ఉద్యమకారులు స్వామి గౌడ్, వివేక్, చంద్ర శేఖర్, యన్నం.శ్రీనివాస్ రెడ్డితో ప్రాథమికంగా చర్చలు జరిపారు.

Related posts