telugu navyamedia
తెలంగాణ వార్తలు

చికోటీ ప్ర‌వీణ్ కేసులో కొత్త కొణాలు : న‌లుగురు ప్ర‌జాప్ర‌తినిధుల‌కు ఈడీ నోటీసులు

*చికోటీ ప్ర‌వీణ్ కేసులో కొత్త కొణాలు
*చికోటీ కాల్ లిస్ట్‌లో న‌లుగురు ప్ర‌జాప్ర‌తినిధులు
*న‌లుగురు ఎమ్మెల్యేలుతో వాట్సాప్‌ చాటింగ్‌
*న‌లుగురు ప్ర‌జాప్ర‌తినిధుల‌కు ఈడీ నోటీసులు
*సోమ‌వారం విచార‌ణ‌కు హాజ‌రు కావాల‌ని ఈడీ ఆదేశం
*తెలంగాణ నుంచి ముగ్గురు, ఏపీ నుంచి ఒకరు ఉన్న‌ట్లుతెలుస్తోంది
*ప్ర‌వీణ్ ఆర్ధిక లావాదేవీల‌పై ఈడీ ఆరా

చికోటి ప్రవీణ్ క్యాసినో హ‌వాల‌ కేసులో కొత్త కొణాలు వెలుగులోకి వ‌చ్చాయి. నాలుగు రోజుల పాటు చికోటి ప్రవీణ్‌ను విచారించిన ఈడీ నలుగురు రాజకీయ నాయకులకు నోటీసులు జారీ చేసింది.

సోమవారం వారంతా విచార‌ణ‌కు హాజ‌రు కావాల‌ని ఈడీ నోటీసుల్లో పేర్కొంది. ప్రవీణ్ వాట్సాప్ చాటింగ్‌లో రాజకీయ ప్రముఖుల బండారం బయటపడినట్లుగా తెలుస్తోంది.

ప్రవీణ్ ఇచ్చిన స్టేట్‌మెంట్, వాట్సాప్ చాట్ ఆధారంగా నోటీసులు జారీ చేయగా.. ప్రవీణ్, ప్రజాప్రతినిధుల మధ్య పలు ట్రాన్సాక్షన్స్ జరిగినట్లు ఈడీ గుర్తించింది. వారిలో తెలంగాణ నుంచి ముగ్గురు ఎమ్మెల్యేలు, ఏపీ నుంచి ఒక‌రు ఉన్న‌ట్లు తెలుస్తోంది.

విదేశీ కేసినోల వ్యవహారంలో చీకోటి ప్రవీణ్‌ను ఈడీ అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. ఈ కేసులో ప్రవీణ్‌ను విచారించిన ఈడీ అనేక కీలక వివరాలు వెల్లడించినట్లు తెలిసిందే.

అలాగే, ప్రవీణ్ ట్రాన్సాక్షన్స్, వాట్సప్ చాటింగ్ సహా కీలక వివరాలను తెలుసుకున్నట్లు సమాచారం. ఈడీ విచారణ నేపథ్యంలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది.

మ‌రోవైపు తనకు ప్రాణహానీ ఉందని, తనకు భద్రత కావాలంటూ హైకోర్టులో పిటిష‌న్ దాఖ‌లు చేసిన విష‌యం తెలిసిందే.

Related posts