ఒక్క సరిగా దేశ వ్యాప్తంగా కలకలం సృష్టించిన లోన్ యాప్స్ కు సంబంధించి కేసులు అధికంగా హైదరాబాద్ లో నమోదయ్యాయి. ఈ కేసులో ఇప్పటికే అనేకమందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా, ఈ లోన్ యాప్ స్కామ్ పై ఈడీ కూడా కేసులు నమోదు చేసింది. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ లో నమోదైన కేసులపై ఈడీ విచారణ మొదలుపెట్టింది. ఇప్పటికే దాదాపుగా రూ.30 వేల కోట్ల రూపాయలను చైనాకు తరలించినట్లు ఈడీ గుర్తించింది. ఈ కేసులో పోలీసులు నలుగురు చైనీయులతో పాటుగా మరో 30 మందిని అదుపులోకి తీసుకున్నారు. మరికొంతమంది చైనీయులు పరారీలో ఉన్నారు. ఇక ఈ కేసులో కీలక సూత్రధారిగా ఉన్న జెన్నిఫర్ కోసం లుక్ అవుట్ నోటీసులు జారీ చేసింది భారత ప్రభుత్వం. జెన్నిఫర్ హాంకాంగ్ లో ఉన్నారని ప్రాధమిక సమాచారం. మనీ లాండరింగ్ తో పాటుగా, హవాలా ద్వారా డబ్బు తరలించినట్టు గుర్తించారు. రోజర్ పే, పెటియం గేట్ వే ల ద్వారా నిధులను బదలాయించినట్టు తెలిపారు. సిగ్గుడాలి మరి ఇంకా ముందు ముందు ఏ ఏ విషయాలు బయటికి వస్తాయి అనేది.
previous post
next post
కాస్త క్లోజ్‌గా ఉంటే లవ్ వచ్చేస్తుందా?… అమ్మ రాజశేఖర్ భార్య ఫైర్