telugu navyamedia
క్రైమ్ వార్తలు

శ్రీ కృష్ణ జ్యువెలర్స్ లో ఈడీ అధికారుల సోదాలు..

హైదరాబాద్ లోని రావిరాల జెమ్స్ అండ్ జ్యువెల్లెర్స్ పార్కులో ఉన్న శ్రీ కృష్ణ జ్యువెలర్స్‌లో భారీ కుంభకోనం జరిగినట్టు ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.

శ్రీకృష్ణ జ్యువెలరీ షాపులు, కార్యాలయాల్లో ఏకకాలంలో దాడులు చేసిన ఈడీ అధికారులు… బృందాలుగా విడిపోయి సోదాలు చేస్తున్నారు. పన్నులు ఎగ్గొట్టేందుకు విదేశాల నుండి అక్రమ మార్గంలో బంగారాన్ని కొనుగోలు చేసినట్టుగా పోలీసులు గతంలో శ్రీకృష్ణ జ్యువెలర్స్ సంస్థపై అభియోగాలు నమోదు చేశారు. రూ.330 కోట్ల విలువైన 1,100 కేజీల బంగారు ఆభరణాలను మళ్లించి నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించినందుకు గతంలో డీఆర్​ఐ కేసు నమోదు చేసింది.

రంగారెడ్డి జిల్లా రావిరాల యూనిట్లో ఈ అక్రమాలకు వెలుగులో వచ్చినట్లు డీఆర్​ఐ తెలిపింది. 2019 లో ఈ కేసులో శ్రీ కృష్ణ జ్యువెలర్స్ ఎండీ ప్రదీప్ కుమార్‌తో పాటు మరో ముగ్గురిని అరెస్టు చేసిన డీఆర్​ఐ అధికారులు వారిని రిమాండ్​కు తరలించారు. ఆ కేసు ఆధారంగానే మనీలాండరింగ్​కు పాల్పడినట్లు ఈడీ అధికారులు వివరాలు సేకరించారు.

ఆభరణాల ఎగుమతుల్లో సైతం స్కామ్ చేసినట్టు గుర్తించిన ఈడీ, ఆభరణాల్లో పెట్టిన వజ్ర వైడూర్యాలకు సంబంధించి కూడా సరైన లెక్కలు చూపని వైనంపై కూపీ లాగుతోంది. దీంతో ఇవాళ హైదరాబాద్ నగరంలో శ్రీ కృష్ణ జ్యువెలర్స్‌కి చెందిన షోరూంలు అన్నింటిలో ఈడీ సోదాలు చేపట్టింది.

ప్రస్తుతం నగరంలోని బంజారాహిల్స్ ప్రధాన కార్యాలయం సహా పలు శ్రీకృష్ణ జ్యువెలరీ షాపులు, కార్యాలయాల్లో ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. దుకాణంలోని సిబ్బందిని ప్రశ్నిస్తున్నారు.

Related posts