telugu navyamedia
Uncategorized ట్రెండింగ్ రాజకీయ

సైనికుల త్యాగాలాను .. రాజకీయాలు చేయకండి.. : ఈసీ

election notifivation by 12th said ec

ఇటీవల జరిగిన పుల్వామా ఉగ్రదాడిని కూడా దేశంలో రాజకీయ పార్టీలు రాజకీయాలకు అనుకూలంగా మార్చుకుంటున్న విషయం తెలిసిందే. ఈ విషయంపై పలువురు తీవ్రంగా విమర్శలు గుప్పిస్తున్నారు. తాజాగా ఎన్నికల సంఘం కూడా ఈ విషయంపై రాజకీయ పార్టీలకు తగిన సూచనలు జారీచేసింది. సైనికుల త్యాగాలాను రాజకీయ పార్టీలు తమ ఎన్నికల ప్రచారానికి వినియోగించుకుంటే కఠినంగా వ్యవహరిస్తామని కేంద్ర ఎన్నికల సంఘం తీవ్రంగా హెచ్చరించింది. ఈ విషయంలో రాజకీయ పార్టీల అధినాయకత్వం తమ కేడర్‌కు స్పష్టమైన సూచనలు ఇవ్వాని ఆదేశించింది.

ఇటీవల సరిహద్దులో ఉద్రిక్త పరిస్థితులు, పాకిస్థాన్‌ సైన్యానికి భారత్‌ వాయుసేన వింగ్‌ కమాండర్‌ అభినందన్‌ వర్థమాన్‌ చిక్కడం, ఆ తర్వాత ఇరుదేశాల మధ్య చర్చల్లో భాగంగా ఆయన విడుదల కావడం, వాఘా సరిహద్దులో అతన్ని అప్పగించిన సందర్భంగా ఉద్విగ్నపరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. ఈ ఘటనలతో అభినందన్‌ ఒక్కసారిగా రియల్‌ హీరోలా మారిపోయారు. దేశవ్యాప్తంగా అభినందన్‌తో ఉన్న హోర్డింగ్‌లు, బ్యానర్లు ఏర్పాటుచేసి అభిమానులు ఆయనకు ఘనస్వాగతం పలికారు.

ఇదే అదనుగా ఓ బీజేపీ సీనియర్‌ నాయకుడు తయారు చేయించుకున్న హోర్డింగ్‌లో అభినందన్‌ ఫొటో వాడారు. ఈ హోర్డింగ్‌ కాస్త సామాజిక మాధ్యమాల్లో చక్కర్లుకొట్టి వైరల్‌గా మారడంతో ఎన్నికలు సంఘం దృష్టికి వెళ్లింది. దీనిపై స్పందించిన ఈసీ సైనికుల ఫొటోలు వాడరాదంటూ ఆదేశాలు జారీ చేసింది.

Related posts