telugu navyamedia
క్రైమ్ వార్తలు

పాకిస్థాన్‌లో భారీ భూకంపం

పాకిస్థాన్‌లోని బలూచిస్థాన్‌ ప్రావిన్స్‌లో భారీ భూకంపం సంభవించింది. గురువారం తెల్లవారుజామున 3.30 సమయంలో భూమి కంపించింది. దీని తీవ్రత 5.7గా నమోదయిందని నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సీస్మోలజీ వెల్లడించింది.

భూకంపం ధాటికి 20 మంది చనిపోయారని, 200 మందికి పైగా గాయపడ్డారని అధికారులు తెలిపారు. మృతుల్లో మహిళలు, ఆరుగురు చిన్నారులు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని బలూచిస్థాన్‌ డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ అథారిటీ అధికారి నసీర్‌ నాసర్‌ ప్రకటించారు.

కాగా, ప్రజలంతా నిద్రలో ఉండగా భూకంపం సంభవించిందని, భవనాల పైకప్పులు కూలిపడటంతో ప్రాణనష్టం ఎక్కువగా జరిగిందని తెలిపారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందన్నారు. భూకంపం సంభవించిన ప్రాంతానికి సరైన రవాణా సౌకర్యాలు లేకపోవడంతో సహాయక చర్యలు ఆలస్యమవుతున్నాయని వెల్లడించారు. భూప్రకంపనలతో క్వెట్టాలో ప్రజలు భయాందోళనలకు గురైనట్లు తెలిపారు.

 

Related posts