telugu navyamedia
ఆంధ్ర వార్తలు వార్తలు

బాలా త్రిపుర సుంద‌రీదేవిగా దర్శనమిస్తున్న దుర్గ‌మ్మ..

విజయవాడ లో దసరా శరన్నవరాత్రి వేడుకల్లో రెండవ రోజు అమ్మవారు శ్రీ బలాత్రిపురసుందరి దేవిగా భక్తులకు దర్శనం ఇస్తున్నారు ఉదయం 6 గంటల నుంచి రాత్రి 8గంటల వరకు భక్తులకు అమ్మవారి దర్శనంకి అనుమతి ఉంది. భక్తులు తప్పనిసరిగా ఆన్లైన్ లోనే టికెట్ బుక్ చేసుకోవాలి. గంటకి 1000 మంది భక్తులు చొప్పున అమ్మవారి దర్శనం… అంటే రోజుకి 10 వేల మంది భక్తులు మాత్రమే అనుమతి ఇస్తున్నారు అధికారులు. రెండు గంటలకు ఒక సారి క్యూ లైన్ లో సానిటైజ్ చేస్తున్నారు.

మ‌న‌స్సు, బుద్ధి, చిత్తం శ్రీ బాల త్రిపురసుందరీ దేవి ఆధీనంలో ఉంటాయి. అభ‌య‌హ‌స్త ముద్ర‌తో ఉండే ఈ త‌ల్లి అనుగ్ర‌హం కోసం ఉపాస‌కులు బాలార్చ‌న చేస్తారు. ఈ రోజున రెండు నుంచి ప‌దేళ్ల లోపు బాలిక‌ల‌ను అమ్మవారి స్వ‌రూపంగా భావించి.. పూజించి కొత్త బ‌ట్ట‌లు పెడ‌తారు. అమ్మ‌వారికి ఆకుప‌చ్చ‌, ఎరుపు, పసుపు రంగు చీర‌లు క‌ట్టి పాయ‌సం, గారెల‌ను నైవేద్యంగా నివేదిస్తారు. శ్రీ బాల త్రిపుర సుందరీదేవిని దర్శించుకుంటే అంతా మంచి జరుగుతుందని అర్చకులు చెబుతున్నారు.

Related posts