telugu navyamedia
తెలంగాణ వార్తలు

తెలంగాణలో రేపటి నుండి దసరా సెలవులు

తెలంగాణ ప్రభుత్వం రేపటి నుండి దసరా సెలవులు ఇస్తున్నట్టు ప్రకటించింది. తెలంగాణలో బతుకమ్మ, దసరా పండుగలను పురస్కరించుకొని బుధవారం నుంచి.. పాఠశాలలకు దసరా సెలవులు ఇవ్వనున్నారు. ఈ రెండు పండుగల సందర్భంగా ఈ నెల 6 నుంచి 17వ తేదీ వరకు 12 రోజులపాటు సెలవులు ఇవ్వనున్నారు. తిరిగి ఈ నెల 18న పాఠశాలలు తెరుచుకోనున్నాయి.

ఇక ఇంటర్‌ కాలేజీలకు ఈ నెల 13వ తేదీ నుంచి సెలవులివ్వనున్నారు. 13 నుంచి 16 వరకు నాలుగు రోజులు మాత్రమే సెలవులు ఉంటాయి. తిరిగి 17న కాలేజీలు ప్రారంభమవుతాయి. ఈ విషయాన్ని అధికారులు ధ్రువీకరించారు.

Related posts