duplicate currency at corners of india

ఏపీలో ఉపాధి కూలీలకు వేతనంగా నకిలీ నోట్లు…?

36

 దేశంలో నకిలీ దందా ఎంత జాగర్తగా ఉన్నా కొనసాగుతూనే ఉంది. దాదాపు పోలీసు అధికారులు తమ పని తాము చేస్తే ఇటువంటివి కనిపించవు, కానీ రక్షించాల్సిన వారే బక్షిస్తున్నట్టుగా అధికారులు నాయకుల అండదండలతో  మాఫియాను దేశంలో మారుమూల ప్రాంతాలకు కూడా విస్తరించేశారు. ఇంతటి ఘోరం జరుగుతున్నా పట్టించుకోని అధికారులను విచక్షణ మరిచిపోయి నిర్దాక్షిణ్యంగా విధులనుండి తప్పించి కఠినమైన శిక్షలు వేయాల్సిందే. ఇలాంటి దందా ఎక్కడివరకు పాకిందో చిన్న సంఘటన మనకు తెలియజేస్తుంది. మరి ఇటువంటి దేశాన్ని ఎవరైనా తమదేశం అని చెప్పుకోడానికి కాస్త జంకుతారనటంలో సందేహం ఉందా…ఆలోచించండి.

 శ్రీకాకుళం జిల్లా బూర్జ మండలం తోటవాడ గ్రామంలో ఉపాధి కూలీలకు పంపిణీ చేసిన నోట్లలో నకిలీ నోట్లు వెలుగు చూశాయి. పని చేసిన కూలీలకు తోటవాడ పోస్టుమాస్టర్‌ తిరుపతిరావు బుధవారం వేతనాలు పంపిణీ చేశారు. వీటిలో సుమారు రూ.15 వేల వరకు నకిలీ వంద నోట్లు ఉన్నట్లు కొంత మంది కూలీలు గుర్తించి తోటవాడ సర్పంచ్‌ గేదెల ప్రసాద్‌కు చూపించారు.

సర్పంచ్‌ పోస్టుమాస్టర్‌ని పిలిపించి ప్రశ్నించగా తోటవాడ హోమియో ఆస్పత్రిలో అటెండర్‌గా పనిచేస్తున్న అప్పారావు మంగళవారం రూ.3.50 లక్షలు డిపాజిట్‌ చేశారని. ఆ నోట్లనే తాను కూలీలకు పంపిణీ చేశానని చెప్పుకొచ్చారు. ఈ విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్లగా, పోస్టుమాస్టర్‌ తిరుపతిరావు, అటెండర్‌ అప్పారావును బూర్జ పోలీసులు అదుపులోకి తీసుకొని సీఐ సమక్షంలో విచారిస్తున్నారు. నకిలీ నోట్ల వ్యవహారంలో మరో వ్యక్తి హస్తం ఉన్నట్లు అప్పారావు తెలియజేయటంతో సంబంధిత వ్యక్తి కోసం పోలీసులు ఆరా తీస్తున్నారు.