telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వ్యాపార వార్తలు

పుల్వామా ఘటనతో .. గగనతలం మూసేసిన పాక్..! నష్టాల్లో భారత విమానసంస్థలు.. !!

air india request to jet airways for planes

విమాన సంస్థల అధికారులు చెమటలు కక్కుతున్నారు. ఎయిరిండియా విమానాయాన సంస్థ సహా పలు విమాన సంస్థలు తీవ్ర నష్టాల్లో పయనిస్తున్నాయి. నష్టాల బాట పట్టడానికి కారణం ఏంటని తలలు పట్టుకున్నారు. ఏంటని సుదీర్ఘంగా ఆలోచించగా ఎయిరిండియా నష్టాల్లో పయనించేందుకు కారణం పాక్ అని తేల్చారు. ఈ ఏడాది ఫిబ్రవరి 26న బాలాకోట్ దాడులు జరిగిన తర్వాత ఆ దేశం తన గగనతలంను మూసివేసింది. దీనికి తోడు ఆయిల్ కంపెనీలు ఆయిల్ ధరలను విపరీతంగా పెంచేశాయి. పాక్ తన గగనతలం మూసివేయడంతో చాలావరకు విమానాలు ప్రత్యామ్నాయ రూట్లలో ప్రయాణించాల్సి వస్తోంది. దీని తో దూరం పెరిగిపోయింది. ఆ సమయంలో ఇంధనం కూడా ఎక్కువగా ఖర్చు అవడంతో విమానాయాన సంస్థ కాస్త నష్టాల బాట పట్టింది.

దానికి తోడుగా, మే నెలలో ఇందనం ధరలు 2.5శాతం ఎక్కువగా పెరిగాయి. అంతర్జాతీయ విమాన సర్వీసులకు కిలో లీటరు ధర 700 డాలర్లు ఖర్చుకానుంది. ఇది గత నెలలో 668 డాలర్లుగా ఉన్నింది. ఇక పాకిస్తాన్ గగనతలం మే 15 వరకు మూసే ఉంటుందనే సమాచారం ఉంది. దీంతో విమాన సర్వీసులకు నష్టాలు తప్పడం లేదు. పాకిస్తాన్ గగనతలం మూసివేయడంతో రోజుకు దాదాపు 400 విమానసర్వీసులపై ఆ ప్రభావం పడుతోంది. ఇందులో చాలా విమాన సర్వీసులు ఓమన్ గగనతలం మీదుగా ప్రయాణిస్తుండగా …ఇరాన్ గగనతలం మీదుగా సాధారణం కంటే 100 విమానాలు ఎక్కువగా ఎగురుతున్నాయి. పాశ్చాత్యదేశాలకు వెళ్లాలంటే కొన్ని విమానాలు ఢిల్లీ గగనతలం మీదుగా వెళ్లకుండా ముంబై గగనతలం మీదుగా వెళుతున్నాయని దీంతో దూరం పెరిగిపోతోందని అధికారులు చెబుతున్నారు.

బాలకోట్ ఘటన అనంతరం ఢిల్లీ నుంచి అమెరికాకు వెళ్లే నాన్‌స్టాప్ విమానాలు పెరిగిన దూరం కారణంగా మధ్యలో ఆగి ఇంధనం నింపుకుంటున్నాయి. దీంతో చేరాల్సిన గమ్యస్థానంకు సాధారణ సమయం కంటే మూడు గంటలు అధికంగా తీసుకుంటున్నాయి. ఢిల్లీ నుంచి ఇస్తాంబుల్ వెళ్లే ఇండిగో విమానం అహ్మదాబాదు, దోహా విమానాశ్రయాల్లో ల్యాండ్ అయి ఇంధనం నింపుకుని ఆ తర్వాత బయలుదేరుతున్నాయి. ఇక ఎయిరిండియా ముంబై అహ్మదాబాదు మీదుగా అరేబియన్ సముద్రం పై ప్రయాణించి మస్కట్‌కు చేరుకుంటున్నాయి. ఇక సింగపూర్ ఎయిర్‌లైన్స్, ఫిన్నేర్, బ్రిటీష్ ఎయిర్‌వేస్, ఏరోఫ్లోట్, థాయ్‌ ఎయిర్‌వేస్‌లాంటి పలు అంతర్జాతీయ సర్వీసులు కూడా ప్రత్యామ్నాయ మార్గాల్లో పయనిస్తున్నట్లు సమాచారం.

Related posts