telugu navyamedia
రాజకీయ

ఆసియా బుక్ అఫ్ రికార్డ్స్ లో డాక్టర్ రఘునాథ బాబు మురుకొండ ..

వైద్యం చాలా పవిత్రమైన వృత్తి . ఈ వృత్తిలో వున్న డాక్టర్లు దీనిని వ్యాపారంగా మార్చకుండా సేవాభావంతో పనిచేస్త్ ఎంతో గుర్తింపు , గౌరవం వస్తాయి. సమాజంలో వీరికి అత్యున్నత స్థానం లభిస్తుంది . అలాంటి అరుదైన డాక్టర్ల లో మురుకొండ రఘునాథ బాబు ఒకరు. డాక్టర్ రఘునాథ బాబు కు ఇప్పుడు అరుదైన గౌరవం లభించింది. మధుమేహ వ్యాధి గ్రస్తుల కోసం అనేక చోట్ల ఏర్పాటు చేసిన క్యాంపు లో పాల్గొని సేవలందించినందుకు ” ఆసియా బుక్ అఫ్ రికార్డ్స్ “లో స్తానం లభించింది.

డాక్టర్ రఘునాథ బాబు అంటే మధుమేహ వ్యాధి గ్రస్తులకు ఎంతో నమ్మకం , ఆయన హస్తవాసి మంచిదని వేలాదిమంది నమ్ముతారు . డాక్టర్ గా తన దగ్గరకు వచ్చిన రోగులను భయపెట్టి డబ్బు చేసుకునే తత్త్వం కాదు. రోగుల్లో భయాన్ని పోగొట్టి ధైర్యాన్ని ఇస్తారు . అంతే కాదు రెండు నెలల్లోనే అత్యధికంగా షుగర్ వ్యాధితో బాధ పడేవారికి సరైన మందులతో నియంత్రణలోకి తీసుకు వస్తారు.

డాక్టర్ రఘునాథ బాబు క్లినిక్ ఎప్పుడూ రోగు లతో కాదు ఆత్మీయులతో నిండి పోతుంది . వచ్చిన వారితో వారి సమస్యను తెలుసుకొని వారిలో భరోసా నింపుతారు. మధుమేహాన్ని , దాని తీవ్రతను బట్టి మందులు ఇస్తారు . అంతే కాదు ఆహారపు అలవాట్ల లో మార్పు తీసుకొస్తారు . అందుకే మధుమేహ వ్యాధిగ్రస్తులు రఘనాథ బాబును ఎంతో నమ్ముతారు.

డాక్టర్ రఘునాథ బాబు ఇటు హైదరాబాద్ లోను అటు తాను పుట్టి పెరిగిన చిలకలూరి పేట లోను మధుమేహ వ్యాధి గ్రస్తులకు తన సేవలను అందిస్తున్నారు. తెలుగు సినిమా రంగంలో దర్శక రత్న దాసరి నారాయణ రావు ను అందరూ అభిమానించేవారు , ప్రేమించేవారు , కారణం సినిమా రంగం తన కుటుంబమని ఆయన భావించడమే. అలాగే రఘునాథ బాబు కూడా తెలుగు సినిమా రంగానికి చెందిన ఎవరు వెళ్లినా వారిని ఆప్యాయంగా ఆహ్వానిస్తారు, వారిలో చెప్పలేనంత భరోసా నింపుతారు. అన్నట్టు రఘునాథ బాబు దాసరి నారాయణ రావు గారి అల్లుడు. దాసరి గారి వారసత్వాన్ని రఘునాథ బాబు వైద్యరంగంలో కొనసాగిస్తున్నారు.

డాక్టర్ రఘునాథ బాబు కు ఆసియా బుక్ అఫ్ రికార్డ్స్ లో అరుదైన గౌరవం లభించిన సందర్భంగా నవ్య మీడియా డాక్టర్ గారికి అభినందనలు తెలియజేస్తోంది .

Related posts