telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

మెగాస్టార్ ఫాన్స్ కి… డబుల్ ధమాకా..

chiru

రాజకీయాల నుండి మళ్లీ సినిమాల వైపు మొగ్గిన మెగాస్టార్ చిరంజీవి ఖైదీ నెంబర్ 150 విజయంతో మంచి జోష్ మీదున్నారు. అదే ఊపుతో ప్రస్తుతం అయన సురేందర్ రెడ్డి దర్శకత్వంలో నటిస్తున్న సైరా సినిమా కూడా వేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా వచ్చే దసరాకు ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. ఇప్పటికే షూటింగ్ 70 శాతానికి పైగా పూర్తి అయినట్లు చెపుతున్నారు. ఇకపోతే ఈ సినిమా విడుదల తరువాత ఒక మూడు నెలలు రెస్ట్ తీసుకున్న తరువాత మెగాస్టార్ తన తదుపరి సినిమాని మొదలెడతారట. శ్రీమంతుడు, జనతా బ్యారేజి, భరత్ అనే నేను వంటి సూపర్ డూపర్ హిట్స్ కొట్టిన దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందనుంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి ప్రీ ప్రొడక్షన్ వర్క్ కూడా పూర్తి అయిందని సమాచారం. అంతేకాదు చిత్ర యూనిట్ హీరోయిన్ మరియు ఇతర నటీనటుల ఎంపిక కూడా త్వరగా కానిస్తున్నట్లు చెప్తున్నారు.

ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి ఒక వార్త సోషల్ మీడియా మరియు టాలీవుడ్ వర్గాల్లో విపరీతంగా వైరల్ అవుతోంది. అదేమిటంటే ఈ సినిమాలో మెగాస్టార్ కు సంబంధించి నటించే హీరోయిన్లుగా ఒక ఇద్దరినీ ఎంపిక చేసారని, ఎందుకంటే ఈ సినిమాలో అయన డ్యూయల్ రోల్ పోషిస్తున్నట్లు చెప్తున్నారు. ఒకటి మంచి మాస్ తరహా ప్రాధాన్యం ఉండే పాత్ర అయితే, మరొకటి సాఫ్ట్ గా సాగె ఎన్నారై పాత్ర అని సమాచారం. అలానే ఈ రెండు పాత్రలను తన కలం పదునుతో ఎంతో అద్భుతంగా రాసుకున్నారట కొరటాల. అంతేకాక మంచి కమర్షియల్ ఎంటర్టైనర్ గా రూపొందబోయే ఈ సినిమాలో మంచి మెసేజ్ కూడా ఉంటుందని తెలుస్తోంది.

రాబోయే సంక్రాంతి కానుకగా అధికారికంగా ప్రారంభమయ్యే ఈ సినిమాలోని ఇతర నటీనటులు మరియు సాంకేతిక నిపుణుల వివరాలు కూడా అదే సమయంలో అధికారికంగా ప్రకటించనున్నారట. మరి మెగాస్టార్ తో చేయబోయే ఈ మెగా ప్రాజెక్ట్ తో కొరటాల ఎంతటి హిట్ కొడతారో వేచి చూడాలి. ఇందులో ఒక గమ్మత్తయిన విషయం ఏమిటంటే, గతంలో మెగాస్టార్ నటించిన ఖైదీ నెంబర్ 150 లో కూడా అయన డ్యూయల్ రోల్ పోషించిన విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం ప్రచారం అవుతున్న ఈ వార్త నిజామా లేక కాదా అనే విషయం అటుంచితే, ఒకవేళ నిజం అయితే మాత్రం మెగా ఫ్యాన్స్ కు నిజంగా డబుల్ ట్రీట్ అనే చెప్పాలి….!!

Related posts