తాను ఆరోగ్యంగా ఉన్నానని, ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయి ఇంటికి చేరుకున్నానని, భగవంతుడి కృప, అభిమానుల ఆశీస్సులతో ఆరోగ్యంగా ఉన్నానని ప్రముఖ గాయని పి. సుశీల స్వయంగా వీడియో విడుదల చేశారు.
కొంచెం కడుపు నొప్పి తో నలతగా అనిపిస్తే ఆసుపత్రిలో చేరి చికిత్స పొందినట్లు తెలిపారు. వైద్యులు ఎంతో అభిమానంతో త్వరగా కోలుకునేలా చేశారని ఆమె కృతఙ్ఞతలు తెలిపారు.
సోషల్ మీడియా లో కొందరు యు ట్యూబర్లు నా అనారోగ్యం పట్ల లేనిపోని అనుమానాలు రేకెత్తిస్తున్నారని, అవన్నీ పుకార్లు అని, వదంతులు నమ్మొద్దని పి. సుశీల విజ్ఞప్తి చేశారు.