telugu navyamedia
రాజకీయ సామాజిక

బెంగాల్‌ లో ఆగని ఆందోళన .. పలువురు డాక్టర్లు రాజీనామా

doctors stike bengal

పశ్చిమ బెంగాల్‌లోని ఎన్‌ఆర్‌ఎస్‌ మెడికల్‌ కాలేజీ, ఆసుపత్రిలో జూనియర్‌ వైద్యులపై దాడిని నిరసిస్తూ వైద్యులు సమ్మె చేస్తున్న సంగతి తెలిసిందే. వీరికి మద్దతుగా దేశవ్యాప్తంగా అన్ని ప్రధాన నగరాల్లోని వైద్యులు శుక్రవారం సమ్మెకు దిగారు. బెంగాల్‌ డాక్టర్ల నిరసనకు మద్దతుగా పలువురు డాక్టర్లు రాజీనామా చేశారు.

ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా తాము విధి నిర్వహణలో కొనసాగలేమని, అందుకే తమ ఉద్యోగాలకు రాజీనామా చేస్తున్నామని ఆర్‌జీ కర్‌ మెడికల్‌ కాలేజీ ఆస్పత్రికి చెందిన 16 మంది డాక్టర్లు బెంగాల్‌ ప్రభుత్వానికి లేఖ రాశారు. తమ రాజీనామా లేఖలను ఆరోగ్య శాఖకు సమర్పించారు. రాజీనామా చేసిన డాక్టర్లందరూ ప్రభుత్వానికి రాసిన లేఖపై సంతకాలు చేశారు. బెంగాల్ వ్యాప్తంగా ఇప్పటి వరకు 70 మంది డాక్టర్లు తమ ఉద్యోగాలకు రాజీనామా చేసి ఆందోళన బాట పట్టారు.

బెంగాల్‌ డాక్టర్లకు మద్దతుగా దేశవ్యాప్తంగా అన్ని ప్రధాన నగరాల్లోని వైద్యులు శుక్రవారం సమ్మెకు దిగారు. ఎయిమ్స్‌ రెసిడెంట్‌ వైద్యుల సంఘం పిలుపు మేరకు డాక్టర్లు ఈ సమ్మె చేపట్టారు. ఢిల్లీ సహా ముంబయి, బెంగళూరు, హైదరాబాద్‌ తదితర ప్రధాన నగరాల్లో వైద్యులు ఒక్క రోజు విధులు బహిష్కరించి ఆందోళన చేస్తున్నారు.

Related posts