ప్రస్తుతం మన దేశంలో 5 రాష్ట్రాలలో ఎన్నికలు జరుగుతున్నాయి. అందులో తమిళనాడు కూడా ఒక్కటి. అయితే అక్కడ మరో నాలుగు రోజుల్లో ఎన్నికలు ఉండటంతో పార్టీలు జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నాయి. డీఎంకే విజయం కోసం అన్ని రకాల మార్గాలను అన్వేషిస్తోంది. స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే తప్పకుండా విజయం సాధిస్తుందని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి దురైమురుగన్ స్పష్టం చేశారు. క్రిష్ణగిరి జిల్లా బర్గుర్ నియోజక వర్గంలో జరిగిన ప్రచార సభలో అయన ప్రసంగించారు. రాబోయే పదేళ్లలో స్టాలిన్ దేశానికీ ప్రధాని అవుతాయని, తాను చెప్పించి అక్షరాలా నిజం అవుతుందని అన్నారు. ఒకే దేశం.. ఒకే బాషా.. ఒకే జాతి నినాదంతో కేంద్రం పనిచేస్తోందని, వివిధ జాతులు, సంస్కృతుల మేళవింపు భారత దేశం అని, కేంద్రం తీసుకుంటున్న మూర్ఖపు నిర్ణయాలను ప్రజలు వ్యతిరేకిస్తున్నారని అన్నారు. కేంద్రం చర్యలు అడ్డుకొని, ఎదుర్కొనగలిగే ధీటైన నాయకుడు కావాలని దేశ ప్రజలు కోరుకుంటున్నారని, అలాంటి లక్షణాలున్న వ్యక్తి స్టాలిన్ అని, వచ్చే పదేళ్ల కాలంలో స్టాలిన్ తప్పకుండా దేశానికీ ప్రధాని అవుతారని దురైమురుగన్ పేర్కొన్నారు. అయితే చూడాలి మరి ఈ ఎన్నికలో ప్రజలు ఎవరిని గెలిపిస్తారు అనేది.
previous post