telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ సామాజిక

డీజే లకు ఇక .. సమయ పరిమితులు.. మీరితే కఠిన శిక్షలు.. నిషేధం..

dj banned and time limit specified

కుర్ర కారు డీజే (డిస్క్ జాకీ) మ్యూజిక్ అనగానే ఎగిరి.. ఎగిరి.. గంతేస్తారు. ఇదే మ్యూజిక్ కొంత పెద్ద వయస్సులో ఉన్న వారికి, అనారోగ్యం ఉన్న వారి గుండెల్లో దడ పుట్టిస్తోంది. అంతే కాకుండా సుప్రీం కోర్టు మార్గదర్శకాల ప్రకారం ఉండాల్సిన శబ్ద పరిమితికి విరుద్ధంగా డీజే మ్యూజిక్ శబ్ద కాలుష్యాన్ని సృష్టిస్తుందట. అందుకే మన రాష్ట్రంలో డీజే సౌండ్స్‌తో నిర్వహించే మ్యూజిక్ పూర్తిగా నిషేధం. కాని కొన్ని సందర్భాల్లో ప్రత్యేక అనుమతులు పొంది వీటిని నిర్వహిస్తుంటారని సమాచారం ఉన్నా సంబంధిత పోలీసు అధికారులు మాత్రం అధికారికంగా డీజే సౌండ్స్ ఈవెంట్స్, మ్యూజిక్‌కు అనుమతి ఉండదని స్పష్టం చేస్తున్నారు.

మరి కొన్ని సందర్భాల్లో రాజకీయ ఒత్తిళ్లతో పలు సందర్భాల్లో వీటిని అక్రమంగా ఉపయోగిస్తుంటారు. కొన్ని సార్లు డీజేలను అనుమతించని సందర్భాల్లో పోలీసు అధికారులకు అనేక కష్టాలను తెచ్చిపెట్టిందని సమాచారం. ఈ వ్యవహరంపై పోలీసులు, రాజకీయ ప్రతినిధుల మధ్య జరిగిన మాటల యుద్ధంతో చివరకు ఇగోకు దారి తీసి అధికారుల బదిలీకి కూడా ప్రయత్నించారనే సంఘటనలను పోలీసు వర్గాల్లో చర్చలు సాగుతుంటాయి. డీజే మ్యూజిక్ సందర్భంగా సౌండ్ పెంచడం, తగ్గించడం వంటి అంశాల్లో ఇష్టాఇష్టాలకు పోయి యువత వర్గాలుగా విడిపోయి గొడవలకు దిగి స్థానికంగా ఉద్రిక్తతకు కారణమైన సందర్భాలు చాలానే ఉన్నాయి. అయినా చాలా చోట్ల పోలీసుల అనుమతి లేకుండానే కొంత మంది వారి పలుకుపడితో పలు శుభకార్యాలు, ర్యాలీలు ఇతర సందర్భాల్లో వీటిని ఉపయోగిస్తూనే ఉన్నారు.

ఈ డీజే శబ్దాలు .. సుప్రీం కోర్టు మార్గదర్శకాల ప్రకారం ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు శబ్దం పట్టణ ప్రాంతాల్లో 55, గ్రామాల్లో 45 డెసిబుల్స్ స్థాయిని మించకూడదని స్పష్టంగా సూచించారు. ఇక రాత్రి 10 దాటితే ఆ శబ్దం కూడా ఉండవద్దని తమ మార్గదర్శకాల్లో సూచించింది. దీంతో అంతకు మించి శబ్దం ఎవరు ఉపయోగించినా అది చట్ట విరుద్ధమేనని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. దీంతో తెలంగాణలో డీజే (డిస్క్ జాకీ)సౌండ్స్‌తో మ్యూజిక్‌ను నిషేధించారు. డీజే సౌండ్స్ మ్యూజిక్ కనీసం శబ్దం 100 డెసిబుల్స్‌కు మించి ఉంటుంది. ఇలా సౌండ్‌ను పెంచకుంటూ పోతే ఒక్కోసారి 300 డెసిబుల్స్ కూడా దాటుతుంది.

ఈ శబ్దం అనారోగ్యంతో ఉన్న వారికి ప్రాణ సంకటంగా మారుతుంది. సాధారణ ప్రజలకు కూడా ఈ శబ్దం వస్తున్న ప్రాంతంలో నిలబడితే గుండె దడతో సాధారణ స్థాయి కంటే ఎక్కువగా కొట్టుకుని కలవరాన్ని రేపుతోంది. దీంతో 55 డెసిబుల్స్ శబ్దం దాటితే అది శబ్ద కాలుష్యానికి దారి తీయడంతో పాటు చట్ట వ్యతిరేక పనిగా భావించడానికి అవకాశం ఇస్తుంది. సాధారణంగా వాహనాలు, ఇతర సామాగ్రి ద్వారా వచ్చే శబ్దం పట్టణ ప్రాంతాల్లో 55 డెసిబుల్స్, గ్రామీణ ప్రాంతాల్లో 45 డెసిబుల్స్ దాటదని, దాటకూడదని అధికారిక రికార్డులు ఉన్నాయి. అందుకే వాహనాలకు సైలెన్స్‌ర్‌లు తీసి నడిపినా, తరుచుగా హార్‌న్‌లు మోగించినా ట్రాఫిక్ పోలీసులు చలాన్‌లను వేస్తారు.

Related posts