telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

హీరో భుజాలపై కూర్చొని హీరోయిన్ లిప్ లాక్

Malang

యంగ్ హాట్ బ్యూటీ దిశా పటానీ ప్రస్తుతం ‘మలంగ్’ అనే చిత్రంలో నటిస్తోంది. ఆదిత్య రాయ్ కపూర్, అనిల్ కపూర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. దిశ ఆదిత్య ప్రేయసి పాత్రను పోషిస్తోంది. అయితే ఇటీవల ఈ సినిమాకు సంబంధించిన కొన్ని ఫస్ట్‌లుక్ పోస్టర్లు విడుదల అయ్యాయి. వాటిలో ఆదిత్య రాయ్ కపూర్, దిశా పటానీకి సంబంధించిన లుక్ సోషల్ మీడియాలో సెగలు రేపుతోంది. లుక్‌లో దిశ ఆదిత్య భుజాలపై కూర్చుని మరీ అతనికి లిప్ లాక్ ఇస్తున్నట్లు కనిపించారు. ఈ లుక్ చాలా మంది అట్రాక్ట్ చేస్తోంది. ఫస్ట్‌లుక్ పోస్టరే ఈ రేంజ్‌లో ఉంటే ఇక సినిమాలో వీరి ప్రేమ సన్నివేశాలు ఇంకెలా ఉంటాయోనని నెటిజన్లు తెగ ఆత్రుతగా ఎదురుచూస్తు్న్నారు. ఇందులో అనిల్ కపూర్ పోలీసుగా విలన్ పాత్రలో కనిపించనున్నారు. ‘ఆషికి 2’, ‘ఏక్ విలన్’ వంటి బ్లా్క్ బస్టర్ హిట్స్ ఇచ్చిన దర్శకుడు మోహిత్ సూరి ఈ సినిమాను డైరెక్ట్ చేశారు. 6న ట్రైలర్‌ విడుదల చేస్తారు. ఫిబ్రవరి 7న సినిమా విడుదల కాబోతోంది.

Related posts