telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ఈ దర్శకులు నా శరీరం, తొడలు చూడాలంటూ… హీరోయిన్ వ్యాఖ్యలు

Surveen

“మీటూ” ఉద్యమం ఇది వ‌ర‌కు ఉన్నంత ఉధృతంగా అయితే మాత్రం కొనసాగడం లేదు. ఈ ఉద్య‌మ ప్రారంభ స‌మ‌యంలో సీనియ‌ర్ న‌టుడు నానాప‌టేకర్‌పై త‌నుశ్రీ దత్తా కాస్టింగ్ కౌచ్ ఆరోప‌ణ‌లు చేసింది. అలాగే ద‌క్షిణాదిన ప్ర‌ముఖ ర‌చ‌యిత వైర‌ముత్తుపై సింగ‌ర్ చిన్మ‌యి ఆరోప‌ణ‌లు చేసింది. ఇక సీనియ‌ర్ హీరో అర్జున్‌పై కూడా హీరోయిన్ శృతి హరిహ‌ర‌న్ లైంగిక వేధింపుల ఆరోప‌ణ‌లు చేసింది. ఇలా చాలా మంది త‌మ‌కు ఎదురైన ఇబ్బందిక‌ర‌మైన ప‌రిస్థితుల గురించి బహిరంగంగా గళమెత్తారు. అయితే కొంత మంది మాత్రం నెమ్మదిగా తాము ఎదుర్కొన్న కాస్టింగ్ కౌచ్ పరిస్థితులను చెబుతున్నారు. ఇప్పుడు తెలుగు, త‌మిళ‌, హిందీ చిత్రాల్లో న‌టించిన హీరోయిన్ సుర్విన్ చావ్లా ఓ ఇంట‌ర్వ్యూలో తాను ఐదుసార్లు కాస్టింగ్ కౌచ్‌ను ఎదుర్కొన్నాన‌ని చెప్పి పెద్ద బాంబే వేశారు. ద‌క్షిణాదిన మూడుసార్లు, ఉత్త‌రాదిన రెండు సార్లు తాను కాస్టింగ్ కౌచ్ స‌మ‌స్య‌ను ఎదుర్కొన్నాన‌ని ఆమె ఈ ఇంటర్వ్యూలో తెలిపారు. “టీవీ రంగం నుండి వ‌చ్చిన నాకు సినిమా రంగంలో ప్ర‌యాణం అంత స‌జావుగా సాగ‌లేదు. ద‌క్షిణాదిన జాతీయ అవార్డు తెచ్చుకున్న ఓ ద‌ర్శ‌కుడి (ఇత‌నికి త‌మిళం మాత్ర‌మే వ‌చ్చు) ద‌గ్గ‌ర‌కు ఆడిష‌న్‌కు వెళితే.. ఏవేవో డైలాగులు చెప్పించి ఏదేదో చేయించాడు. నాకు ఆరోగ్యం స‌రిగా లేదంటూ ముంబై వ‌చ్చేశాను. వేరే వారితో నాకు ఫోన్ చేయించి “నీకు ఆరోగ్యం స‌రిగా లేదు క‌దా.. నేను ముంబై రావాలా?” అని అడిగించాడు. “నో థ్యాంక్స్” అన్నాను. అంతే కాకుండా “సార్ నీ గురించి తెలుసుకోవాల‌నుకుంటున్నారు. అది సినిమా జరిగే వ‌ర‌కే, త‌ర్వాత ఆపేయ‌వ‌చ్చు” అని కూడా అడిగించాడు. దానికి నేను “మీరు రాంగ్ డోర్ కొడుతున్నారు. నేను టాలెంటెడ్ అనుకుంటే సినిమా చేద్దాం” అన్నాను. ఇప్ప‌టి వ‌ర‌కు ఆ సినిమా మొద‌లు కానేలేదు. అలాగే మ‌రో ద‌ర్శ‌కుడు “నీ శ‌రీరంలో ప్ర‌తి భాగం గురించి తెలుసుకోవాల‌నుకుంటున్నాను” అన్నాడు. రెండేళ్ల ముందు కూడా బాలీవుడ్‌లో ఓ దర్శ‌కుడు “నీ ఎద ఎలా ఉంటుందో చూడాల‌నుకుంటున్నాను” అన్నాడు. మ‌రో దర్శ‌కుడు “నీ తొడ‌లు ఎలా ఉంటాయో చూడాల‌నుకుంటున్నాను” అన్నాడు. వారు నాతో త‌ప్పుగా ప్ర‌వ‌ర్తించిన ప్ర‌తిసారి వారి ఆఫీసుల నుండి బ‌య‌ట‌కు వ‌చ్చేశానంటూ త‌న‌కు ఎదురైన కాస్టింగ్ కౌచ్ ప‌రిస్థితుల గురించి సుర్విన్ చావ్లా తెలియ‌జేశారు.

Related posts