telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

అక్కినేని హీరోతో స్టెప్పులేయనున్న బుట్టబొమ్మ..!

అఖిల్ అక్కినేని తన పేరుతోనే సినీమా చేసి హీరోగా పరిచయం అయ్యాడు. మొదట సోషియో ఫాంటసీ విధానంలో తీసిన సినిమా అనుకున్న స్థాయిలో రాణించకపోయే సరికి, ఇక తండ్రిలా టాలీవుడ్‌లో మరో గ్రీకు వీరుడు అవ్వాలని రొమాంటిక్ కథలను ఎంచుకుంటున్నాడు. హలో సినిమా ఈ కోవకు చెందిందే. అయితే ఇప్పటి వరకు అఖిల్ చసిన సినిమాలు అంతగా రాణించలేక పోయాయి. అయితే ఇటీవల అఖిల్ హీరోగా మరో సినిమాను తెరకెక్కిస్తున్నాడు. అందులో బుట్టబొమ్మ పూజా హీరోయిన్‌గా కనిపించనుంది. ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తి కావస్తుంది. ఇక విడుదల అయ్యేందుకు సిద్దం అవుతోంది. మరి ఈ సినిమా ఓటీటీను వేదికాగా మార్చుకుంటుందా, లేదా థియేటర్లలోనే విడుదల అవుతుందా అనేది చూడాలి. అయితే అఖిల్ మరో సినిమాకు పచ్చ జండా ఊపాడు. సురేంధర్ దర్శకత్వంలో తన నూతన సినిమాకు తెరతీసేందుకు సిద్దమవుతున్నాడు. అయితే దీనిపై వినిపిస్తున్న వార్తలను బట్టి చూస్తే సరేంధర్ ఒట్టి సినిమా తీసి ఊరుకునేల లేడు. మరి అటు హీరో అఖిల్‌కు, ఇటు ప్రేక్షకులకు భారీ స్థాయిలో ఎదో సప్రైజ్ ఇవ్వనున్నాడని వార్తలు వస్తున్నాయి. మరి గిఫ్ట్ ఎంటో తెలుసుకోవాలంటే వేచి చూడాల్సిందే.

Related posts