telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

హోం క్వారంటైన్‌లోకి డైరెక్టర్‌ సుకుమార్‌..!

Sukumar

సుకుమార్ ఈ పేరు అందరికి సుపరిచితమే. తనదైన దర్శకత్వంతో ప్రేక్షకులను ఉర్రూతలూగాస్తాడు. భారీ ప్రాజెక్టులను సైతం అలవోకగా పూర్తి చేస్తాడు. సుకుమార్ దర్శకత్వం అంటేనే ఆ సినిమాకు ప్రత్యేకమైన క్రేజ్ వస్తుంది. ప్రస్తుతం ఈ దర్శకుడు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌ హీరోగా పుష్పా సినిమాను చిత్రీకరిస్తున్నాడు. ఇటీవల రాజమండ్రి పరిసరాల్లోని అడవుల్లో షూటింగ్ చేసుకొని వారణాసికి బయలుదెరారు. తాజాగా వచ్చిన వార్తల ప్రకారం ఈ సినిమా షూటింగ్‌ను కొంతకాలం నిలిపివేశారు. దానికి కారణం అర్థం కాక అభిమానుల బేలమొఖం వేశారు. అయితే పుష్పా బృందంలో కొందరికి కరోనా లక్షణాలు కనిపించడంతో సుక్కు ఈ నిర్ణయం తీసుకున్నాడు. దాంతో కొందరు పరీక్షలు చేయించుకోగా వారికి కరోనా పాజిటివ్ అని తేలడంతో అందరూ అప్రమత్తం అయ్యి షూటింగ్‌ను నిలిపివేశారు. అంతేకాకుండా వారి క్రూ మెంబర్స్‌లో ఒకరు చనిపోయారని, వారికి తరువాత కరోనా పాజిటివ్ అని తేలిందని సుకుమార్ తెలిపాడు. దాంతో ప్రస్తుతం ఈ దర్శకుడు సెల్ఫ్ ఐసోలేషన్‌లోకి వెళ్లాడు. అయితే అతడు కొందరితో టచ్‌లో ఉన్నాడని, కానీ హరో అల్లు అర్జున్ మరికొందరు ముఖ్యులతో మాత్రం అతడు టచ్‌లో లేడని తెలిపారు. మరో పది రోజుల్లో పుష్పు టీమ్ మొత్తం కరోనా పరీక్షకు వెళ్లనున్నట్లు తెలిపారు.

Related posts