telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

వరస్ట్‌ కంట్రీస్‌ ఫర్‌ ఉమెన్‌ అని చూస్తే.. అందులో మన దేశం : పూరి

Puri

డాషింగ్‌ డైరెక్టర్‌ పూరీ జగన్నాథ్‌ తాజాగా తన పూరీ మ్యూజింగ్స్‌లో వరల్డ్‌ డాటర్స్‌ డే సందర్భంగా “కూతుళ్ల” గురించి మాట్లాడారు. “ఇండియాలో చాలా మంది వాళ్ల కడుపున అబ్బాయే పుట్టాలనుకుంటారు. అమ్మాయి వద్దు. అమ్మాయి పుట్టగానే అప్‌సెట్‌ అయిన చాలా మంది మగాళ్లను చూశాను. ఇండియాలో సర్వే చేస్తే, యాబై శాతం ఆడాళ్లు కూడా అబ్బాయే కావాలని కోరుకుంటున్నారని తెలిసింది. ఎందుకంటే.. ముసలి వయసులో కొడుకైతే మనల్ని చూసుకుంటాడు. కూతురైతే పెళ్లి చేసుకుని వెళ్లిపోతుందని పేరెంట్స్‌ అనుకుంటారు. అది వాళ్ల భ్రమ. కొడుకు చూస్తాడని గ్యారెంటీ లేదు. తల్లిదండ్రులను రోడ్డుపై వదిలేసిన ఎంతో మంది కొడుకులున్నారు. కానీ అత్తింట్లో ఉన్నా, అమ్మా నాన్నలను చూసుకునే కూతుళ్లు ఎంతో మంది ఉన్నారు. పేరెంట్స్‌ కోసం నిజంగా నిలబడేది కూతుళ్లే. నిజంగా సేవ చేసేది కూడా వాళ్లే. పెళ్లి చేసి చేతులు దులిపేసుకోవడం కాదు. కూతుళ్ల కెరీర్‌ గురించి కూడా ఆలోచించాలి. మన ఓల్డేజ్‌ ప్లాన్‌ గురించి కాదు. కొడుకుల్లాగే వాళ్లు ఎదగాలి. వాళ్ల కాళ్ల మీద వాళ్లు నిలబడేలా చూడాలి. వాళ్లకి, వాళ్ల అభిప్రాయాలకు విలువ ఇవ్వాలి. పెళ్లొద్దు అంటే మానేయాలి. బిజినెస్‌ చేయాలంటే చేయమనాలి. కొండెక్కుతానంటే ఎక్కమనాలి. ఆడవాళ్లకు సేఫ్టీ, సెక్యూరిటీ ఉన్న దేశాలేవీ అని గూగుల్‌లో సెర్చ్‌ చేశాను. టాప్‌ 20 దేశాల్లో మనం దేశం లేదు. పోనీ టాప్‌ 40లో అయినా మన దేశం ఉందేమోనని చూశా.. అందులోనూ లేదు. చివరకు టాప్‌ 100లోనూ మన దేశం లేదు. వరస్ట్‌ కంట్రీస్‌ ఫర్‌ ఉమెన్‌ అని చూస్తే.. అందులో మన దేశం పేరుంది. ఇతర దేశాల్లో అమ్మాయిలకు సపోర్టివ్‌గా ఎన్నో ఉన్నాయి. ఎడ్యుకేషన్‌, ఉమెన్‌ లెవల్‌ ఆఫ్‌ పార్టిసిపేషన్‌, ఆర్దిక, రాజకీయ, సామాజిక విభాగాల్లో అవకాశాలు, ఇవి కాకుండా సెక్యూరిటీ, అర్థరాత్రిలో ఒంటరిగా నడవడం కానీ, ఇలా ఎందులో అయినా స్త్రీలకు మంచి ప్రాధాన్యత ఉంటుంది. వాళ్లకు సపోర్ట్‌గా న్యాయవ్యవస్థ ఉంటుంది. ఆడవాళ్లను ఏమైనా అంటే తాట తీస్తారు. కాబట్టి మనం కూడా మారుదాం. అప్పుడే దేశం మారుద్ది. కొత్త కూతుళ్లను కనక్కర్లేదు. ఉన్న ఆడకూతుళ్లను బాగా చూసుకుంటే చాలు. గుర్తు పెట్టుకోండి. అమ్మానాన్న కోసం కంటతడి పెట్టేది ఆడ కూతురే. మీ ఆడపిల్ల మీ ఇంటి లక్ష్మీదేవి అని మీరు ఫీలైతే, ఆ లక్ష్మీదేవిని తీసుకెళ్లి ఎవడి కొంపలోనో పడేయకండి. స్ట్రాంగ్‌ మైండెడ్‌ పేరెంట్స్‌కు, ఇండిపెండెంట్‌ డాటర్స్‌కు నా సెల్యూట్‌” అన్నారు పూరి.

Related posts