telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

అనిల్ రావిపూడి ఛాలెంజ్‌లో జంధ్యాల కామెడీ …

anil-ravipudi

ప్రస్తుతం టాలీవుడ్‌లో ‘బి ద రియల్ మ్యాన్’ ఛాలెంజ్ నడుస్తోన్న సంగతి తెలిసిందే. ఈ ఛాలెంజ్‌లో భాగంగా డైరెక్టర్ అనిల్ రావిపూడికి విక్టరీ వెంకటేష్ నామినేట్ చేశారు. ఈ ఛాలెంజ్‌ను స్వీకరించిన అనిల్ రావిపూడి ఇంట్లో పనులన్నీ చేసేసి వీడియో తీసేసి ట్వీట్ చేసేశారు. అయితే, ఈ వీడియోలో ముందుగా టీవీని చూపించారు. ఆ టీవీలో జంధ్యాల సినిమాలోని మంచి కామెడీ సన్నివేశం వస్తోంది. ఈ సన్నివేశంలో డైలాగునే ఈ వీడియోలో బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌గా పెట్టారు. ఈ వీడియోలో అనిల్ మాప్‌తో ఫ్లోర్ క్లీన్ చేసేశారు, కిచెన్‌లో గిన్నెలు కడిగేశారు, బెడ్‌రూంలో దుప్పట్లు మడతపెట్టేశారు.. టమాటాలు, ఉల్లిపాయలు తరిగేశారు, మొక్కలకు నీళ్లు పోశారు.. ఇలా ఇంట్లో పనిలో తన వంతు సాయం చేసి రియల్ మ్యాన్ అనిపించుకున్నారు. ‘‘ఇంట్లో వాళ్ళకి కొంత ఫ్రస్ట్రేషన్ రిలీఫ్. మనకి కొంత ఫన్’’ అంటూ కొటేషన్ కూడా ఇచ్చారు. ఈ ఛాలెంజ్‌లో భాగంగా నందమూరి కళ్యాణ్‌రామ్, సాయి ధరమ్ తేజ్, రవితేజను నామినేట్ చేశారు.

Related posts