telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

గుండుతో ఉన్న భార్య ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన దర్శకుడు

లాక్‌డౌన్‌తో ప్రస్తుతం ప్రజలంతా ఇంటికే పరిమితమయ్యారు. కరోనా ఇచ్చిన సెలవులను కుటుంబంతో కలిసి గడుపుతూ సద్వినియోగం చేసుకుంటున్నారు. రక రకాల ప్రయోగాలతో వంటలు చేస్తూ ఇంటిని శుభ్రపరుస్తూ చాలెంజ్‌లు విసురుతూ సోషల్‌ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఈ క్రమంలో మలయాళ దర్శకుడు అమల్‌ నీరద్‌ షేర్‌ చేసిన ఓ ఫొటో నెటిజన్లకు ఆశ్చర్యం కలిగించింది. తన భార్య, నటి జ్యోతిర్మయి గుండుతో ఉన్న ఫొటోను ఇన్‌స్టాలో పోస్ట్‌ చేసిన అమల్‌. సంస్కృత శ్లోక పంక్తి.. ‘‘తమసోమా జ్యోతిర్గమయ’’అనే క్యాప్షన్‌ జతచేశాడు. ఈ క్రమంలో కొంత మంది నెటిజన్లు జ్యోతిర్మయి న్యూలుక్‌లో ఎంతో అందంగా ఉన్నారని కామెంట్‌ చేయగా.. అభిమానులు మాత్రం ఇప్పుడు గుండు చేయించుకోవాల్సిన అవసరం ఏమిటని ఆరా తీస్తున్నారు. కాగా తమిళ, మలయాళ సినిమాల్లో నటించి గుర్తింపు పొందిన జ్యోతిర్మయి తొలుత నిశాంత్‌ కుమార్‌ అనే వ్యక్తిని పెళ్లిచేసుకున్నారు. ఆయన నుంచి విడాకులు తీసుకున్న తర్వాత 2015లో డైరెక్టర్‌, సినిమాటోగ్రాఫర్‌ అమల్‌ నీరద్‌ను వివాహమాడారు.

 

View this post on Instagram

 

Tamasoma Jyothirgamaya 😊 . #Jyothirmayee

A post shared by Amal Neerad (@amalneerad_official) on

Related posts