telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

‘వకీల్ సాబ్’ కోసం దిల్ రాజుకు భారీ ఆఫర్ ఇచ్చిన అమెజాన్ ప్రైమ్

Dilraju

పవన్ కళ్యాణ్ ‘వకీల్‌ సాబ్’ సినిమాపై అంచనాలు భారీగా వున్నాయి. వేణు శ్రీరామ్ దర్శత్వంలో రూపొందుతున్న వకీల్ సాబ్ మూవీ ఇప్పటికే 80 శాతం షూటింగ్ ఫినిష్ చేసుకుంది. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ సరసన అంజలి, నివేత థామస్, అనన్య నాగేళ్ల హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇందులో పవన్ కళ్యాణ్ లాయర్ పాత్రలో కనిపించనున్నారు. అయితే అమెజాన్ ప్రైమ్ వీడియో వకీల్ సాబ్ మూవీ కోసం దిల్ రాజుకు భారీ ఆఫర్ ఇచ్చిందట. అయితే ఆ ఆఫర్ సున్నితంగా తిరస్కరించారట దిల్ రాజు. వకీల్ సాబ్ చిత్రం ఓటీటీ హక్కుల కోసం దిల్ రాజుకు 80 కోట్ల రూపాయల ఆఫర్  వచ్చినప్పటికీ దిల్ రాజు వద్దనుకున్నారట. ఈ సినిమాను డైరెక్టుగా థియేటర్‌లోనే విడుదల చేయాలని చూస్తున్నారట. అందుకే ఆయన ఇలాంటి కీలక నిర్ణయం తీసుకున్నారని సమాచారం.

Related posts