telugu navyamedia
సినిమా వార్తలు

రెండు మూడు రోజుల్లో కొలిక్కి వస్తాయి

ఆగస్ట్‌ 22 నుంచి  సినిమా షూటింగ్‌లు పునఃప్రారంభమవుతాయంటూవస్తున్న వార్తల్లో నిజం లేదని నిర్మాత దిల్‌ రాజు స్పష్టం చేశారు

ఫిల్మ్‌ ఛాంబర్‌లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు… ‘ఆగస్టు 1 నుంచి షూటింగ్‌లు ఆపేసి మరీ కమిటీలు వేసుకున్నామ‌ని అన్నారు. నిలిచిపోయిన సినిమా చిత్రీకరణలు ఎప్పటి నుంచి ప్రారంభమయ్యేది త్వరలో తెలియజేస్తామన్నారు.పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలపై గత 18 రోజులుగా వివిధ విభాగాలతో జరుగుతున్న చర్చలు ఓ కొలిక్కి వస్తున్నాయి.

నిర్మాతలుగా కొన్ని నిర్ణయాలు తీసుకున్నామ‌ని అన్నారు. ఓటీటీలో మూవీ విడుదలపై ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చామ‌ని, 8 వారాల తర్వాతే సినిమాను ఓటీటీలో రిలీజ్‌ చేయాలని నిర్ణయించుకున్నామ‌ని అన్నారు.ఇప్పటికే ఓటీటీలతో అగ్రిమెంట్‌ కుదుర్చుకున్న సినిమాలకు ఈ నియమం వర్తించదని అన్నారు.

టికెట్‌ రేట్లు కూడా తగ్గించాలని భావిస్తున్నామ‌ని, థియేటర్లు, మల్టీప్లెక్సులతో మాట్లాడాం.. సినీప్రియులకు టికెట్‌ రేట్లు తగ్గించి ఇవ్వాలని డిసైడ్‌ అయ్యామ‌ని అన్నారు

ఇక సినిమాలో ఎందుకు వృథా ఖర్చు అవుతుందనేది చర్చించాం.. ఇంకా షూటింగ్స్‌ ఎప్పుడు ప్రారంభం కావాలనేది నిర్ణయం తీసుకోలేదు.

మేము ఇంకా పూర్తి స్థాయిలో చర్చలు జరపలేదు.. మరో రెండు మూడు రోజుల్లో అన్ని పూర్తి చేసుకొని మా నిర్ణయాన్ని మీడియా ముందే తెలుపుతామ‌ని అని చెప్పుకొచ్చాడు. తెలుగు ఫిలిం ఇండస్ట్రీ తీసుకున్న నిర్ణయాన్ని అందరూ గౌరవించారు.

బాలీవుడ్ వాళ్ళు కూడా ఇక్కడ షూటింగ్స్ ఆపడం పై ఆరా తీస్తున్నారు. తమిళ్ లోనూ మీడియా వాళ్ళు అడుగుతున్నారు టాలీవుడ్ లో ఏంజరుగుతుంది అని. ఫైనల్ ప్రెస్ మీట్ లో మేము ఏం చేశాం .. ఏం సాధించాం అన్నది చెప్తామని దిల్ రాజు అన్నారు.ఈ సమావేశానికి సి. కల్యాణ్‌, మైత్రి రవి, దామోదర ప్రసాద్‌, బాపినీడు డైరెక్టర్‌ తేజ తదితరులు హాజరయ్యారు.

Related posts