telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

విజయసాయికి దమ్ముంటే కేంద్ర మంత్రి వ్యాఖ్యలపై ట్వీట్ చేయాలి: దేవినేని

uma devineni

కేంద్ర ప్రభుత్వానికి కనీస సమాచారం ఇవ్వకుండా పోలవరం ప్రాజెక్టు పనులను రాష్ట్ర ప్రభుత్వం రద్దుచేసిందని టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమ ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయవాడలో ఈరోజు టీడీపీ సమన్వయ కమిటీ భేటీ ముగిశాక దేవినేని మీడియాతో మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టు పనులు పోలవరం ప్రాజెక్టు అథారిటీ ఆధ్వర్యంలో జరుగుతున్నాయని తెలిపారు. ఈ విషయంలో కేంద్ర మంత్రి షెకావత్ సంధించిన ప్రశ్నలకు విజయసాయిరెడ్డికి దమ్ముంటే ట్వీట్ చేయాలన్నారు.

ఈరోజు పోలవరం డ్యామ్ నుంచి 10 లక్షల క్యూసెక్కులపై పైగా వరద నీరు కిందకు వెళుతోంది. 15 లక్షల క్యూసెక్కులకు పైగా వరద వస్తోంది. ఇటువంటి పరిస్థితుల్లో నిర్మాణ సంస్థలను బయటకు రమ్మన్నారంటే పోలవరం ప్రాజెక్టుపై మీకున్న చిత్తుశుద్ధి ఏముంది? వరద పోటెత్తుతున్న తరుణంలో వాటిని పర్యవేక్షించకుండా బయటకు రావాలని చెప్పడం వెనుక మీ దుర్మార్గమైన ఆలోచనలు ఏంటి? మీ బాధ్యత ఏంటి అని అడుగుతున్నా. ఇంకా బాధ్యత లేకుండా విజయసాయిరెడ్డి మాపైన ట్వీట్ చేస్తున్నాడని మండిపడ్డారు.

Related posts