telugu navyamedia
ఆంధ్ర వార్తలు క్రైమ్ వార్తలు రాజకీయ వార్తలు

లారీతో తొక్కిస్తా అని బెదిరింపులు.. కొడాలి నానిపై దేవినేని ఫిర్యాదు!

Devineni kodali

లారీతో తొక్కించి చంపుతామని బెదిరించారని ఆరోపిస్తూ ఏపీ మంత్రి కొడాలి నానిపై తాడేపల్లి పోలీస్ స్టేషన్ లో టీడీపీ నేత దేవినేని ఉమ ఫిర్యాదు చేశారు. కొడాలి నానితో పాటు వల్లభనేని వంశీ, వసంత కృష్ణప్రసాద్ లపై కూడా ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా మీడియాతో దేవినేని ఉమ మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్ ప్రేరణతోనే నాని, వంశీ, కృష్ణప్రసాద్ బెదిరిస్తున్నారని అన్నారు.

లారీతో తొక్కిస్తానని ఒక మంత్రి అనడం ఏమిటని మండిపడ్డారు. ఇలాంటి మాటలు రాజ్యాంగ ఉల్లంఘన కిందకు రావా? అని ప్రశ్నించారు. కొడాలి నానిపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మరో టీడీపీ నేత బచ్చుల అర్జునుడు మాట్లాడుతూ, చంద్రబాబు, దేవినేని ఉమలపై కొడాలి నాని అనుచిత వ్యాఖ్యలు చేశారని విమర్శించారు. 

Related posts