బోర్డు పరీక్షలు అంటే, స్క్వాడ్ రావటం, కాపీయింగ్ జరుగుందేమో పరీక్షించి వెళ్లడం సహజం. కానీ స్క్వాడ్ గా డిప్యూటీ సీఎం వస్తే ఎలా ఉంటుంది.. అలా ఆయనకు ఎందుకు వెళ్లాలని అనిపించిందో, పరీక్షా కేంద్రానికి వెళ్లి అక్కడ తనిఖీలు చేశారట. ఈ విచిత్రం ఉత్తరప్రదేశ్ లో జరిగింది. తాజాగా ఆ రాష్ట్ర టెన్త్ బోర్డ్ ఎగ్జామ్స్ ప్రారంభం అయ్యాయి. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం దినేశ్ శర్మ.. అకస్మిక తనిఖీలు చేపట్టారు.
ఎగ్జామ్ రూమ్‌లో పరీక్షలు రాస్తున్న విద్యార్థుల వద్దకు వెళ్లి అక్కడి పరిస్థితులను పరిశీలించారు. లక్నోలోని రాజేంద్రనగర్‌లో ఉన్న నవయుగ కన్యా విద్యాలయాలో ఆయన తనిఖీలు చేశారు. ఈనెల 28వ తేదీ వరకు బోర్డ్ ఎగ్జామ్స్ జరగనున్నాయి. సుమారు 58 లక్షల మంది విద్యార్థులు ఈ పరీక్షకు హాజరుకానున్నారు. చీటింగ్ జరగకుండా.. కాపీయింగ్ మాఫియాను దూరం పెట్టేందుకు ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేశారు.
బందర్ పోర్టుని తెలంగాణకు ఎంతకు అమ్మేశారు: ప్రశ్నించిన దేవిదేని