telugu navyamedia
వార్తలు వ్యాపార వార్తలు సామాజిక

ఉల్లి ధరలకు రెక్కలు .. ఢిల్లీలో కేజీ ధర రూ. 60

onions

భారీ వర్షాల కారణంగా కర్ణాటక, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ లో ఉల్లి పంట దేబతినడంతో దేశ రాజధాని ఢిల్లీలో ఉల్లి ధరలు ఆకాశాన్నంటాయి. ఉల్లిని కోయకుండానే ఢిల్లీ జనాలకు కళ్ల వెంట నీరొస్తోంది. భారీ వర్షాల కారణంగా పలు రాష్ట్రాల్లో ఉల్లి పంట దెబ్బతింది.

దీంతో ఆయా రాష్ట్రాల నుంచి ఢిల్లీలోని రీటెయిల్ మార్కెట్ కు ఉల్లి సరఫరా తగ్గిపోయింది. 10 రోజుల క్రితం వరకు కిలో ఉల్లి ధర రూ. 25 నుంచి రూ. 30 వరకు ఉండగా, ప్రస్తుతం కిలో ధర రూ. 60కి పెరిగింది. డిమాండ్ కంటే సరఫరా తక్కువగా ఉండటంతో ఉల్లి ధర పెరిగినట్టు వ్యాపారస్థులు చెబుతున్నారు.

Related posts